ప్రెగ్నెన్సీ తో ఇబ్బందులు పడుతున్న లాస్య... అందరినీ కదిలిస్తున్న వీడియో

Published : Feb 22, 2023, 01:58 PM IST
ప్రెగ్నెన్సీ తో ఇబ్బందులు పడుతున్న లాస్య... అందరినీ కదిలిస్తున్న వీడియో

సారాంశం

యాంకర్ లాస్య నిండు గర్భిణిగా ఉన్నారు. బేబీ బంప్ తో ఆమెకు ఎంత ఇబ్బందిగా ఉందో తెలియజేస్తూ వీడియో విడుదల చేశారు.   

స్టార్ యాంకర్ లాస్య రెండోసారి తల్లయ్యారు. నిండు గర్భిణిగా ఉన్న లాస్యకు త్వరలో ప్రసవం కానుంది. ప్రెగ్నెంట్ పీరియడ్ ఆడవాళ్ళకు మరో జన్మతో సమానం. చాలా జాగ్రత్తగా ఉండాలి. బిడ్డ కారణంగా పెరిగిన పొట్ట ఏ పనీ సులభంగా చేసుకోనివ్వదు. కూర్చోవడం, పడుకోవడం, నడవడం కూడా కష్టమే. గర్భవతిగా తన ఇబ్బందులు తెలియజేస్తూ ఒక వీడియో షేర్ చేసింది. అలాగే భర్త మంజునాథ్ ఎలా దగ్గరుండి చూసుకుంటున్నారో ఆ వీడియోలో తెలియజేశారు. అమ్మలా చూసుకునే భర్త ఉండగా తనకు ఎంత కష్టమొచ్చినా ఎదుర్కోగలని లాస్య పరోక్షంగా తెలియజేశారు. 

ఇటీవల లాస్య సీమంతం వేడుక ఘనంగా నిర్వహించారు. తల్లిగా పట్టుబట్టల్లో లాస్య కుందనపు బొమ్మలా మెరిశారు. పలువురు బుల్లితెర సెలెబ్రిటీలు ఈ వేడుకకు హాజరయ్యారు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ సైతం సందడి చేశారు. ఇక అభిమానులు బెస్ట్ విషెస్ తెలియజేశారు. తమ అభిమాన యాంకర్ పండంటి బిడ్డకు జన్మనివ్వాలి కోరుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.  

మంజునాథ్ ని లాస్య ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి జున్ను అనే ఓ ఐదేళ్ల బాబు ఉన్నాడు. రెండోసారి లాస్య తల్లయ్యారు. తన ప్రేమను పెద్దలు అంగీకరించలేదని, చాలా కాలం తర్వాత తమను దగ్గర తీసుకున్నారని లాస్య బిగ్ బాస్ హౌస్లో తెలియజేశారు. సీజన్ 4లో పాల్గొన్న లాస్య చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రభావం చూపారు. ఫైనల్ కి కొన్ని వారాల ముందు ఎలిమినేట్ అయ్యారు. తన రుచికరమైన వంటతో కంటెస్టెంట్స్ ప్రేమ పొందారు. 

లాస్య యాంకరింగ్ వదిలేసి చాలా కాలం అవుతుంది. ఒక దశలో టాప్ యాంకర్స్ ఒకరిగా లాస్య పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆమె అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటున్నారు. అలాగే తన పేరిట యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆసక్తికర వీడియోలు చేస్తున్నారు. లాస్య వీడియోలకు సోషల్ మీడియా జనాల్లో బాగానే డిమాండ్ ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌