మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు అరుదైన గౌరవం.. అమెరికన్ టాక్ షోలో సందడి చేయబోతున్న RRR హీరో

Published : Feb 22, 2023, 02:28 PM IST
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు అరుదైన గౌరవం.. అమెరికన్ టాక్ షోలో సందడి చేయబోతున్న RRR హీరో

సారాంశం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు అరుదైన గౌరవం లభించింది. ఇంతవరకూ ఏ ఇండియన్ హీరొకి దక్కని అరుదైన ఘనత ఆయన సాధించారు. అంతే కాదు అమెరికాలో బిజీ బిజీగా గడపబోతున్నారు చరణ్. 


ఇప్పటికే ఆస్కార్ రేస్ లో దూసుకుపోతోంది ట్రిపుల్ ఆర్ సినిమా. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్లను కూడా ఇంప్రెస్ చేసింది ఈ మూవీ. ఇంత వరకూ ఏ ఇండియన్ సినిమా సాధించలేని ఘనతను ఆర్ఆర్ఆర్ సాధించింది. ఇప్పటికే ఈమూవీలో నాటు నాటు సాంగ్ కు గొల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చింది. ఇక ఈసాంగ్ కు ఆస్కార్ కూడా గ్యారంటీ అంటున్నారు సినీ జనాలు. ఈక్రమంలో ట్రిపుల్ ఆర్ వరుసగా ఏదో ఒక ఘనత  సాధిస్తూనే ఉంది. ఈమూవీ హీరోలు.. డైరెక్టర్ కు ఏదొ ఒక గౌరవం లభిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు అరుదైన గౌరవం లభించింది. 

రీసెంట్ గా ఆస్కార్ ప్రమోషన్స్ కోసం అమెరికా వెళ్లారు మెగా పవర్ స్టార్ రాంచరణ్. ప్రస్తుతం  అమెరికాలో హల్‌చల్ చేస్తున్నారు. ఆస్కార్ అవార్డు కోసం RRR సినిమా ప్రమోషన్స్‌ కోసం వెళ్లిన ఆయన హాలీవుడ్ మీడియాను ఆకట్టుకొంటున్నారు. RRR సినిమాలో సీతారామరాజు అనే విభిన్నమైన పాత్రలో, విలక్షణమైన నటనతో ఆకట్టుకున్న రామ్ చరణ్.. ప్రముఖ హాలీవుడ్ దర్శకులు  జేమ్స్ కామెరాన్, స్పీల్ బర్గ్ లాంటి దిగ్గజ దర్శకుల ప్రశంసలు కూడా అందుకొన్నారు. ఇక ఈక్రమంలోనే వి మెగా పవర్ స్టార్ కెరీర్‌లో మరో అరుదైన ఘనత చోటుచేసుకొన్నది. 

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ క్రేజ్ ఇప్పుడు అమెరికాకు చేరింది. ప్రపంచ ప్రఖ్యాత టెలివిజన్ ప్రోగ్రాం గుడ్ మార్నింగ్ అమెరికా నుంచి చరణ్ కు  ఆహ్వానం అందింది. ఈ రోజు (ఫిబ్రవరి 22న) ప్రసారం కానున్న టీవీ షోలో రామ్ చరణ్ సందడి చేయనున్నారు.'గుడ్ మార్నింగ్ అమెరికా' ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్న న్యూ ఏజ్ స్టార్ రామ్ చరణ్ కావడం గమనార్హం. ఈ ఘనత అందుకున్న తొలి తెలుగు హీరోగా కూడా  రామ్ చరణ్ చరిత్ర సృష్టించారు. ఇక ఇండియా నుంచి ఈ జరనేషన్ హీరోలలో మరే హీరో ఈ గౌరవం అందుకోలేదు. 

ఇక అమెరికాలో మధ్యాహ్నం ఒంటి గంటకు, మన ఇండియా టైమ్ ప్రకారం చూస్తే నైట్  11.30 గంటలకు గుడ్ మార్నింగ్ అమెరికా - రామ్ చరణ్ కార్యక్రమం టెలికాస్ట్ కానుంది. ఆర్ఆర్ఆర్ మూవీకి సబంధించిన షూటింగ్ ఎక్స్ పీరియన్స్ తో పాటు.. తనకెరీర్ గురించి.. ఇతర విషమాల గురించి చరణ్ ఈ షోలో మాట్లాడబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఆస్కార్ వేడుకల ప్రచారం కోసం రామ్ చరణ్ ప్రస్తుతం రామ్ చరణ్ అమెరికాలో ఉన్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి బయలు దేరి వెళ్ళారు. ఈ నెల 24న జరగనున్న హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ ప్రోగ్రాంలో కూడా రామ్ చరణ్ సందడి చేయనున్నారు. ప్రజెంటర్ గా అవార్డ్ ఇవ్వనున్నారు. ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్ హీరో కూడా చరణ్ కావడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

2026 Upcoming Top Movies : ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోలు ఎవరు?
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?