షూటింగ్‌లో ప్రమాదం.. స్టార్‌ హీరో‌కి గాయాలు..

Published : Mar 04, 2021, 06:54 PM ISTUpdated : Mar 04, 2021, 06:55 PM IST
షూటింగ్‌లో ప్రమాదం.. స్టార్‌ హీరో‌కి గాయాలు..

సారాంశం

 స్టార్‌ హీరోగా రాణిస్తున్న ఫాహద్‌ ఫాజిల్‌ ప్రస్తుతం `మలయన్కుంజు` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ కొచ్చిలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో భాగంగా బిల్డింగ్‌పై నుంచి దూకే సన్నివేశంలో ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది.

షూటింగ్‌లో ప్రమాదం చోటు చేసుకుని మలయాళ స్టార్‌ హీరోకి గాయాలయ్యాయి. మలయాళ చిత్ర పరిశ్రమలో  స్టార్‌ హీరోగా రాణిస్తున్న ఫాహద్‌ ఫాజిల్‌ ప్రస్తుతం `మలయన్కుంజు` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ కొచ్చిలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో భాగంగా బిల్డింగ్‌పై నుంచి దూకే సన్నివేశంలో ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. బ్యాలెన్స్ తప్పి ఫాహద్‌ బిల్డింగ్‌పై నుంచి పడిపోయినట్టు తెలుస్తుంది. దీంతో వెంటనే ఆయన్ని కొచ్చిలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కి తరలించారు. 

ఈ ప్రమాదంలో ఆయన ముక్కుకి బలమైన గాయమైందట. దీంతోపాటు ఇతర భాగాల్లో స్వల్ప గాయాలైనట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, కొన్ని రోజులపాటు పూర్తి బెడ్‌ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. విషయం తెలిసిన వెంటనే ఆయన భార్య, హీరోయిన్‌ నజ్రియా నజిమ్‌ హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. దగ్గరుండి ఆయన బాగోగులు చూసుకుంటున్నారు. మరోవైపు తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ వేడుకుంటున్నారు. 

ఫాహద్‌ 2014లో హీరోయిన్‌ నజ్రియా నజీమ్‌ని వివాహం చేసుకున్నారు. ఆమె `రాజారాణి` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో `అంటే సుందరానికి` చిత్రంలో నాని సరసన హీరోయిన్‌గా నటిస్తుంది. ఫాహద్‌ ప్రస్తుతం ఓ అరడజనుకుపైగా చిత్రాల్లో నటిస్తూ ఫుల్‌ బీజీగా ఉన్నాడు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?
Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే