`జాతిరత్నాలు` ట్రైలర్‌పై ప్రభాస్‌ ప్రశంసలు..

Published : Mar 04, 2021, 06:27 PM IST
`జాతిరత్నాలు` ట్రైలర్‌పై ప్రభాస్‌ ప్రశంసలు..

సారాంశం

నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌రామకృష్ణ హీరోలుగా రూపొందుతున్న చిత్రం `జాతిరత్నాలు`. అనుదీప్‌ కేవీ దర్శకత్వంలో `మహానటి` ఫేమ్‌ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాని స్వ‌ప్న సినిమా బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. గురువారం ఈ చిత్ర ట్రైలర్‌ని హీరో ప్రభాస్‌ విడుదల చేశారు. 

నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌రామకృష్ణ హీరోలుగా రూపొందుతున్న చిత్రం `జాతిరత్నాలు`. అనుదీప్‌ కేవీ దర్శకత్వంలో `మహానటి` ఫేమ్‌ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాని స్వ‌ప్న సినిమా బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. గురువారం ఈ చిత్ర ట్రైలర్‌ని హీరో ప్రభాస్‌ విడుదల చేశారు. ముంబయిలో ప్రభాస్‌ నివాసానికి వెళ్లి మరీ ఆయన చేతుల మీదుగా ట్రైలర్‌ విడుదల చేయించారు. నవీన్‌ పొలిశెట్టిది జోగిపేట. `జోగిపేట టూ ముంబై` అంటూ ఓ వీడియోని రూపొందించి తాము ప్రభాస్‌ని ఎలా కలుసుకున్నామో చూపించారు. 

ట్రైలర్‌పై ప్రభాస్‌ ప్రశంసలు కురిపించారు. `సూపర్‌ చాలా బాగుంది` అని చెప్పారు. ఫేస్‌బుక్‌ ద్వారా దాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, `టీజర్‌ బాగుంది. ట్రైలర్‌ అయితే ఎక్స్ ట్రార్డినరీగా ఉంది. ట్రైలర్‌ చూసి పది సార్లు నవ్వానంటే సినిమా ఇంకెంతసేపు నవ్విస్తుందో ఊహించుకోవాల్సిందే. సినిమా అంతా హిలేరియ‌స్‌గా ఉంటుంద‌ని అనుకుంటున్నాను. కోవిడ్ త‌ర్వాత ఫ్యామిలీ అంతా వెళ్లి హాయిగా న‌వ్వుకొంటూ ఎంజాయ్ చేసే సినిమా అనుకుంటున్నాను. డైరెక్ట‌ర్ అనుదీప్‌కు, యాక్ట‌ర్స్‌కు, ప్రొడ్యూస‌ర్ నాగ్ అశ్విన్‌కు, ఎంటైర్ యూనిట్‌కు బెస్ట్ విషెస్ చెప్తున్నా` అని అన్నారు. 

తాజాగా ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. నవ్విస్తుంది.  ఈ సినిమాలో శ్రీ‌కాంత్ (న‌వీన్‌)‌, శేఖ‌ర్ (ప్రియ‌ద‌ర్శి)‌, ర‌వి (రాహుల్ రామ‌కృష్ణ‌) ముగ్గురు ఫ్రెండ్స్. శ్రీ‌కాంత్‌కు ఓ ల‌వ్ స్టోరీ కూడా ఉంది. హీరోయిన్‌ను ప‌టాయించ‌డానికి మ‌నోడు ఎన్ని వేషాలు వేస్తాడో ట్రైల‌ర్ చూపించింది. బీటెక్ చ‌దివిన అత‌ను 'శ్రింగార్‌ లేడీస్ ఎంపోరియం' న‌డుపుతుంటాడు. ఎంతో జోవియ‌ల్‌గా ఉండే ఆ ముగ్గురు ఫ్రెండ్స్ చంచ‌ల్‌గూడ జైలుకు ఖైదీలుగా ఎందుకు వెళ్లాల్సి వ‌చ్చిందనేది ఆసక్తిక‌రంగా, ఫుల్ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంది. 

జైలులో ఈ ముగ్గురు ఫ్రెండ్స్‌కి వెన్నెల కిశోర్ కూడా తోడ‌వుతాడు. ఇంక న‌వ్వులకు కొద‌వ ఉంటుందా! చివ‌ర‌లో జ‌డ్జిగా క‌నిపించిన బ్ర‌హ్మానందం "మీ త‌ర‌ఫున వాదించ‌డానికి ఎవ‌రైనా ఉన్నారా?" అన‌డిగితే, బోనుమీద చేత్తో కొడ్తూ న‌వీన్ సీరియ‌స్‌గా, "మా కేస్ మేమే వాదించుకుంటాం యువ‌రాన‌ర్" అని చెప్తాడు. దాంతో బ్ర‌హ్మానందం "తీర్పు కూడా మీరే ఇచ్చుకోండ్రా".. అని త‌న స‌హాయ‌కుడితో, "రేయ్‌.. మ‌న‌మెందుకిక్క‌డ‌? వెళ్లిపోదాం రండి" అని చైర్‌లోంచి లేవ‌డం నవ్వించింది. మార్చి 11న 'జాతిర‌త్నాలు' థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కు రెడీ అవుతోంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం
Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌