`ఆర్‌ఆర్‌ఆర్` చిత్రంలోని షూటింగ్ సెట్‌లోని పలు ఫోటోలు లీకై సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రైట్స్ విషయంలో రికార్డ్ సృష్టిస్తోంది. తాజాగా భారీ మొత్తానికి ప్రముఖ మీడియా సంస్థ డిజిటల్ హక్కులు దక్కించుకుందట.
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్`. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ కంపోజ్ చేస్తున్నారు. మరోవైపు ఈ చిత్రంలోని షూటింగ్ సెట్‌లోని పలు ఫోటోలు లీకై సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రైట్స్ విషయంలో రికార్డ్ సృష్టిస్తోంది. తాజాగా భారీ మొత్తానికి ప్రముఖ మీడియా సంస్థ డిజిటల్ హక్కులు దక్కించుకుందట.
ఇప్పటికే తమిళ థియేట్రికల్ రైట్ప్ ని లైకా సంస్థ దక్కించుకుంది. తాజాగా డిజిటల్ శాటిలైట్ హక్కులను స్టార్ నెట్‌వర్క్ సొంతం చేసుకుందట. ఏకంగా అది రెండు వందల కోట్లు వెచ్చించినట్టు తెలుస్తుంది. డిజిటల్ రైట్స్ విషయంలో భారీ పోటీ నెలకొన్న నేపథ్యంలో స్టార్ గ్రూప్ ఈ మొత్తాన్ని వెచ్చించినట్టు తెలుస్తుంది. ఇదే నిజమైతే ఇంత భారీ మొత్తానికి అమ్ముడు పోయి `ఆర్‌ఆర్‌ఆర్` సరికొత్త రికార్డ్ ని సృష్టించిందనే చెప్పాలి.
డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురంభీమ్‌గా, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. అలియాభట్, ఒలివియా మోర్రీస్ హీరోయిన్లుగా, అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే ఈ రేంజ్‌లో రికార్డులు సృష్టిస్తుంది. మరి విడుదల తర్వాత ఏం స్థాయిలో సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి. పది భారతీయ భాషల్లో దీన్ని విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.