
తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ ముద్దుల కూతురు వరలక్ష్మి త్వరలో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతోంది. 2012లో పోడాపోడి సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి ఇప్పటి వరకు తమిళం, మళయాలం, కన్నడలో సినిమాలు చేసింది కానీ... తెలుగులో నటించలేదు. త్వరలో ఆమె 'శక్తి' అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఫిమేల్ సెంట్రిక్ ప్రాజెక్టుగా మూడు బాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. తెలుగు వెర్షన్ 'శక్తి' అనే పేరును ఖరారు చేశారు. చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ని రానా దగ్గుబాటి విడుదల చేశారు.
వరలక్ష్మి .... అంటే తెలుగు ప్రేక్షకులకు శరత్ కుమార్ కూతురుగా మాత్రమే పరిచయం. ఆ మధ్య విశాల్ ప్రేమలో ఉందనే వార్తలతో హాట్ టాపిక్ అయింది. అంతే కానీ ఆమె సినిమాల గురించి, ఆమె యాక్టింగ్ స్కిల్స్ గురించి తెలుగు వారికి పెద్దగా పరిచయం లేదు. వరలక్ష్మి తొలిసారిగా తెలుగులో నటిస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తెలుగులో శరత్ కుమార్‌కు నటుడిగా మంచి పేరుంది. అయితే తండ్రి నుండి ఆమె నటనను ఏ మేరకు అంది పుచ్చుకుంది అనేది ‘శక్తి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు తెలియనుంది.