తెలుగు పాపులర్ నటుడుపై లైంగిక ఆరోపణలు, ఫోన్ చేసి డైరక్ట్ గా...

By Surya Prakash  |  First Published Aug 27, 2024, 7:51 AM IST

నాతో పడుకోవడానికి నీకు ఇంట్రెస్ట్ ఉందా? అని అడిగాడు. నీకు ఇష్టమైన పొజిషన్ ఏంటో చెప్పాలన్నాడు. 



గత కొద్ది రోజులుగా మళయాళ చిత్ర పరిశ్రమను మీటూ, కాస్టింగ్ కౌచ్ కుదిపేస్తున్నాయి. రీసెంట్ గా బయిటకు వచ్చిన  జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ లో సినిమా అవకాశాలు ఊరికే రావని.. ఎదుటి వారిని సంతోష పరిస్తేనే అవకాశాలు వస్తాయని ఎంతో మంది నటీమణులు బహిరంగంగానే మాట్లాడారు. ఈ క్రమంలో  కొందరు నటులు, హీరోయిన్లు మరోసారి కాస్టింగ్ కౌచ్‌పై మాట్లాడుతున్నారు. పలువురు నటులు  తమకు ఎదురైన పరిస్థితుల గురించి ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో మలయాళ నటి రేవ‌తి సంప‌త్.. సీనియర్ నటుడు సిద్ధిఖపై సంచలన ఆరోపణలు చేసింది. సిద్ధిఖీ త‌న‌ను బలవంతంగా గదిలో బంధించి అనుభవించాడని ఆరోపించింది. ఈ వ్యాఖ్యలు మాలీవుడ్ ఇండ‌స్ట్రీలో దుమారాన్ని రేపుతోన్నాయి.  ఆ విషయమై ఇంకా తేలకముందే ఆమె మరొక నటుడుపై ఆరోపణలు చేసారు. అతను మరెవరో కాదు రియాజ్ ఖాన్. తెలుగు,తమిళ, మళయాళంలో వరస సినిమాలు చేస్తున్నాడు. 

రేవతి సంపత్  ఓ మలయాళీ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. రియాజ్ ఖాన్ తనను ఎలా వేధించాడో  చెప్పుకొచ్చింది.ఆమె మాట్లాడుతూ.... “ఇటీవల ఒక నటుడు చెప్పిన 'అడిచి కేరి వా' డైలాగ్ ట్రెండింగ్ లో ఉంది. ఆ నటుడి నుంచి ఓ రోజు అర్ధరాత్రి  ఫోన్ కాల్ వచ్చింది. ఒక ఫోటోగ్రాఫర్ నా అనుమతి లేకుండా నా ఫోన్ నంబర్‌ ను అతడికి ఇచ్చాడు. ఫోన్ లో సెక్స్ వల్ విషయాలు మాట్లాడాడు. నాతో పడుకోవడానికి నీకు ఇంట్రెస్ట్ ఉందా? అని అడిగాడు. నీకు ఇష్టమైన పొజిషన్ ఏంటో చెప్పాలన్నాడు. ఈ సంఘటన నాకు 20 ఏళ్లు ఉన్నప్పుడు జరిగింది. అతడి మాటలు విని నేను షాక్ అయ్యాను. ఆ ఫోన్ కాల్ లో నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నాకు ఇంట్రెస్ట్ లేదని తనకు అర్థం అయ్యింది. మరో 9 రోజులు తాను కొచ్చిలోనే ఉంటాను. ఎవరైనా అమ్మాయిలు ఉంటే పంపించాలని కోరాడు” అని రేవతి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రియాజ్ ఖాన్ వ్యవహారం మలయాళీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Latest Videos

ఇక  రియాజ్ ఖాన్ తెలుగులోనూ పలు సినిమాలు చేశాడు. 2003లో ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ‘దొంగలు’, ‘శివ శంకర్’, ‘గురు’, ‘నాయకుడు’, ‘నాయుడమ్మ’, ‘స్టాలిన్’, ‘రాజాబాబు’, ‘తులసి’, ‘కారా మజాకా’, ‘www’, ‘అలా ఇలా ఎలా’,గజనీ వంటి  అనేక సినిమాల్లో నటించాడు.

మరో ప్రక్క తనపై లైంగిక ఆరోణలు చేసిన నటి రేవతి సంపత్‌పై నటుడు సిద్ధిక్ కేరళ రాష్ట్ర పోలీసు చీఫ్‌కి అధికారికంగా ఫిర్యాదు చేశారు. రేవతి తనపై తప్పుడు ఆరోపణలు చేసి, నష్టపరిచేలా ప్రచారం చేస్తోందని సిద్ధిక్ ఆరోపించారు. 2016 ప్రారంభంలో సినిమా ప్రివ్యూ సందర్భంగా ఆమెను ఒక్కసారి మాత్రమే కలిశానని, అలాంటి సంఘటనేమీ జరగలేదని పేర్కొన్నాడు.

click me!