మొహానికి కట్లతో మంచు లక్ష్మి.. ఏం జరిగిందంటే?

By Surya Prakash  |  First Published Aug 27, 2024, 7:08 AM IST

 వికటించి పెదవులు ఉబ్బిపోయి, కింది పెదవి కింద చర్మం మొత్తం రాష్ వచ్చిందట. ఇప్పుడు తగ్గిందట. 



మంచు లక్ష్మీ మల్టీ టాలెంటడ్ నటిగానే  కాకుండా నిర్మాతగానూ రాణిస్తున్నారు. అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ విలన్ గా నటించి మెప్పించింది ఆమె. ఆ తర్వాత  మంచు లక్ష్మీ చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో మెప్పించారు.  తెలుగుతో పాటు తమిళ్ భాషలోనూ  మంచు లక్ష్మీ సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. అలాగే వెబ్ సిరీస్‌లు చేస్తూనే పలు టీవీ షోస్ చేస్తూ సందడి చేస్తోంది మంచు లక్ష్మి. "ఆదిపర్వం"తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆమె  యక్షిణి అనే వెబ్ సిరీస్ లోనూ నటించారు. ఇక తాజాగా  మంచు లక్ష్మి  తన ఇన్‌స్టాగ్రామ్‌లో లో షేర్ చేసిన ఓ ఫోటో.. అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. 

ఆమె ఫేస్ మీద లిప్ చుట్టూ బ్యాండేజ్ తో.. మంచు లక్ష్మి ఓ ఫోటోను షేర్ చేశారు. ఆ తర్వాత దానికి సంబంధించి అందరికి తెలిసేలా ఈ ఇంపార్టెంట్ మెసేజ్ ను కూడా అందించారు.  ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో లో లక్ష్మి మంచు ఇలా చెప్పుకొచ్చారు. ఆమె ఇటీవల అమెరికా వెళ్ళినప్పుడు సాధారణ జ్వరం టాబ్లెట్ తీసుకుందట. అది వికటించి పెదవులు ఉబ్బిపోయి, కింది పెదవి కింద చర్మం మొత్తం రాష్ వచ్చిందట. ఇప్పుడు తగ్గిందట. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Latest Videos

“మన బాడీ ఏది యాక్సెప్ట్ చేస్తుందో.. చేయలేదో అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. నేను ఒక కామన్ పిల్ తీసుకోవడం వలన.. కొన్ని సెకండ్స్ లోనే నా లిప్ చుట్టూ ఎలెర్జి ఫామ్ అయింది. వీలైనంత త్వరగా నా ఫ్రెండ్స్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకున్నాను కాబట్టి.. రికవర్ అవుతున్నాను. లేదంటే బాడీ అంత ఎలెర్జి స్ప్రెడ్ అయ్యేది. ఎలెర్జి ఉందని తెలియక చిన్న పిల్స్ తీసుకుని చనిపోయిన వారు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి మీ శరీరానికి ఏది పడుతుంది ఏది పడదు అని టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే.. పిల్స్ తీసుకుని జాగ్రత్తగా ఉండండి” అంటూ తన రికవర్ అయినా తర్వాత ఫొటోస్ ను కూడా షేర్ చేశారు మంచు లక్ష్మి. 

click me!