తగ్గేదే లే అంటున్న నాగ చైతన్య.. 900 మంది డ్యాన్సర్లు, 3 కోట్ల ఖర్చు

By tirumala AN  |  First Published Aug 27, 2024, 7:44 AM IST

చైతు ప్రస్తుతం చందూ ముండేటి దర్శకత్వంలో తండేల్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ నాగ చైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ మూవీలో చైతు మత్స్య కారుడి పాత్రలో నటిస్తున్నారు.


అక్కినేని నాగ చైతన్య పేరు ఇటీవల బాగా వినిపిస్తోంది. తన పర్సనల్ లైఫ్ విషయంలో చైతు వార్తల్లోకెక్కారు. త్వరలో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. అయితే చైతు ప్రస్తుతం చందూ ముండేటి దర్శకత్వంలో తండేల్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. 

ఈ మూవీ నాగ చైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ మూవీలో చైతు మత్స్య కారుడి పాత్రలో నటిస్తున్నారు. దేశభక్తి, పాకిస్తాన్ కి సంబంధించిన సన్నివేశాలు హైలైట్ కాబోతున్నాయి. అల్లు అరవింద్ ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Latest Videos

ఈ మూవీలో రీసెంట్ గా హైదరాబాద్ నగర శివారులో ఒక జాతర సాంగ్ ని షూట్ చేసారు. ఈ సాంగ్ కి ఏకంగా 3 కోట్ల బడ్జెట్ ఖర్చయినట్లు తెలుస్తోంది. స్టార్ హీరోల చిత్రాల్లో మాత్రమే అది కూడా అరుదుగా ఇంత భారీ ఖర్చుతో సాంగ్స్ చూస్తుంటాయి. కానీ నాగ చైతన్య చిత్రానికి ఈ రేంజ్ సాంగ్ తెరకెక్కిస్తున్నారు అంటే పెద్ద సాహసమే చేస్తున్నారు. 

జాతర సాంగ్ కాబట్టి భారీగా డ్యాన్సర్లు అవసరం. 900 మంది డ్యాన్సర్లు ఈ సాంగ్ షూట్ లో పాల్గొన్నారట. వీళ్ళని షూటింగ్ లొకేషన్ కి తరలించడం.. భోజనాలు, కాస్ట్యూమ్స్ లాంటి అదనపు ఖర్చులు బోలెడు ఉన్నాయి. అయినా కూడా చైతు అండ్ టీం తగ్గేదే లే అంటూ సాంగ్ షూట్ పూర్తి చేశారు. విజువల్ ఫీస్ట్ గా ఉండేలా చందు ముండేటి ఈ సాంగ్ ని చిత్రీకరించారట. 

click me!