Brahmastra :రాజ‌మౌళి ‘బ్రహ్మస్త్ర’కి బాలయ్య 'అఖండ' కు లింక్,సింక్

Surya Prakash   | Asianet News
Published : Dec 19, 2021, 02:08 PM IST
Brahmastra :రాజ‌మౌళి ‘బ్రహ్మస్త్ర’కి బాలయ్య 'అఖండ' కు లింక్,సింక్

సారాంశం

  శివుడు బ్యాక్ డ్రాప్ లో ఓ చిత్రం రూపొందుతోంది. హిందీలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగులో రాజమౌళి సమర్పిస్తున్నారు. మన దక్షిణాది రాష్ట్రాల్లో అఖండ స్దాయిలో ఆడుతుందని బావిస్తున్నారు.

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలై భారీ క‌లెక్ష‌న్లు సాధిస్తోంది.  పరమ శివుని అంశలో జన్మించిన అఖండ కథతో రూపొందిన ఈ చిత్రం గురించి అంతటా రచ్చ,చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఇప్పుడు శివుడు బ్యాక్ డ్రాప్ లో ఓ చిత్రం రూపొందుతోంది. హిందీలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగులో రాజమౌళి సమర్పిస్తున్నారు. మన దక్షిణాది రాష్ట్రాల్లో అఖండ స్దాయిలో ఆడుతుందని బావిస్తున్నారు.

రాజమౌళి బాహుబలి చిత్రం ఇంపాక్ట్ అంతటా పడింది.  ఈ నేపధ్యంలో  బాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’.ర‌ణ‌బీర్ క‌పూర్, ఆలియా భ‌ట్, అక్కినేని నాగార్జున, అమితాబ్ బ‌చ్చ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో అయాన్ ముఖ‌ర్జీ రూపొందిస్తున్న బ్ర‌హ్మాస్త్ర‌ను అగ్ర ద‌ర్శ‌కుడు, నిర్మాత క‌ర‌ణ్ జోహార్ నిర్మిస్తున్నారు.  బాహుబ‌లిని హిందీలో రిలీజ్ చేసి క్లిక్ చేయడంలో, బ్లాక్‌బ‌స్ట‌ర్ కావ‌డంలో కీల‌క పాత్ర పోషించింది క‌ర‌ణ్ జోహారే.  అలా ఏర్ప‌డిన అనుబంధంతో క‌ర‌ణ్‌.. రాజ‌మౌళిని బ్ర‌హ్మాస్త్ర సినిమాలో భాగం చేసారు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌  విడుదలై క్రేజ్ తెచ్చుకుంది.

రాజమౌళి మాట్లాడుతూ...‘‘బ్రహ్మాస్త్ర’ సినిమా చేస్తున్నాం. అయాన్‌ ముఖర్జీ డైరెక్టర్‌. అతడు మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నాడు.. అని మూడేళ్ల క్రితం కరణ్‌జోహార్‌ నాకు ఫోన్‌ చేసి చెప్పారు. నేను ఓకే అనడంతో అయాన్‌ హైదరాబాద్‌ వచ్చి నన్ను కలిశారు. అయాన్‌తో మాట్లాడినప్పుడు సినిమా పట్ల అతడికున్న ప్రేమ చూసి.. ‘ఇతనెవరో నాకంటే పిచ్చోడులా ఉన్నాడు’ అనుకున్నా. ఎందుకంటే అతడికి సినిమాపై నాకంటే ఎక్కువ ఇష్టం ఉంది. ఆ తర్వాత ‘బ్రహ్మాస్త్ర’ గురించి సీరియస్‌గా ఆలోచించాను. అయాన్‌ ఒక బ్రహ్మాండాన్ని క్రియేట్‌ చేస్తున్నారని అర్థమైంది. దాంతో ఈ ప్రాజెక్ట్‌లో నేను కూడా భాగం కావాలని నిర్ణయించుకున్నాను. దక్షిణాది భాషల్లో ‘బ్రహ్మాస్త్ర’ని సమర్పిస్తున్నాను’అన్నారు.

 

‘‘దక్షిణాదిలో ఈ చిత్రాన్ని మీరు సమర్పించడం నాకెంతో ఆనందంగా ఉంది. మన దేశంలో నంబర్‌-1 డైరెక్టర్‌ మీరే. ఎన్నో ఏళ్ల నుంచి మేము ఈ చిత్రాన్ని చేస్తున్నాం. మునుపెన్నడూ చూడని ఓ సరికొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందించడం కోసమే కష్టపడుతున్నాం. ఈ సినిమా విషయంలో నాగార్జున మాకెంతో సపోర్ట్‌ చేశారు. ఇక నా కెరీర్‌ ప్రారంభమైనప్పటి నుంచి నన్ను ప్రోత్సహిస్తున్న వ్యక్తి కరణ్‌ జోహార్‌.’’ - దర్శకుడు అయాన్‌ ముఖర్జీ

‘‘అయాన్‌ నా పెద్ద కొడుకులాంటి వాడు. మా ధర్మా ప్రొడక్షన్‌కి సీక్రెట్‌ బ్రహ్మాస్త్ర అతడు. ఈ సినిమా కోసం ఎంతో శ్రమిస్తున్నాడు. అతడి కలను సాకారం చేయడం కోసం టీమ్‌ మరెంతో కష్టపడుతోంది. రణ్‌బీర్‌‌ ఏడేళ్ల నుంచి ఈ సినిమా కోసం పనిచేస్తున్నాడు. ఆలియా నా బేబీ గర్ల్‌. తను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఉన్నందుకు నేనెంతో సంతోషిస్తున్నా. ‘ఈగ’ సినిమా చూసి థియేటర్‌లో చప్పట్లు కొట్టాను. ఈగతోనే ఇన్ని అద్భుతాలు చేశాడంటే మనుషులతో ఇంకెన్ని అద్భుతాలు చేస్తారో అనుకున్నా.. ఆ సమయంలో ‘బాహుబలి’ వచ్చింది. హిందీలో ఆ సినిమా విడుదల చేసేందుకు నాకు అవకాశం ఇవ్వండి సర్‌ అని అడిగాను. ఆయన ఓకే అన్నారు. అలా ఆ చిత్రాన్ని బాలీవుడ్‌లో నేను విడుదల చేశా’’ అంటూ చెప్పుకొచ్చారు కరణ్‌జోహార్‌
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ramya Krishnan రహస్యం వెల్లడించిన రజినీకాంత్, నీలాంబరి పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ ఎవరో తెలుసా?
400 సినిమాల రికార్డు, 100 కోట్లకుపైగా ఆస్తి, 3 పెళ్లిళ్లు చేసుకున్న స్టార్ యాక్టర్ ఎవరో తెలుసా?