BUNNY-BOYAPATI : ఇక అఖండ- పుష్ప కాంబినేషన్ కు లైన్ క్లియర్.. గతంలోకి వెళ్ళబోతున్న అల్లు అర్జున్

Published : Dec 19, 2021, 12:53 PM IST
BUNNY-BOYAPATI : ఇక అఖండ- పుష్ప కాంబినేషన్ కు లైన్ క్లియర్.. గతంలోకి వెళ్ళబోతున్న అల్లు అర్జున్

సారాంశం

అఖండ-పుష్ప ఈ కాంబినేషన్ కు లైన్ క్లియర్ అయ్యింది. రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో అటు అఖండ డైరెక్టర్.. ఇటు పుష్ప హీరో.. ఇద్దరు సినిమాకు రెడీ అవుతున్నారు.

 

ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన పుష్ప సూపర్ హిట్ అయ్యింది.కలెక్షన్ల మోతమోగిస్తుంది. ఇక బన్ని నెక్ట్స్ మూవీపై ఫ్యాన్స్ ఆత్రుతగా ఉన్నారు. అయితే అల్లు అర్జున్(ALLU ARJUN) నెక్ట్స్ మూవీ బోయపాటి(BOYAPATI,)తో దాదాపు ఫిక్స్ అయినట్టే తెలుస్తోంది. అటు బోయాపాటి కూడా బాలయ్య అఖండ(AKHANDA,) సూపర్ హిట్ తో మంచి జోష్ మీద ఉన్నాడు. వినయ విధేయ రామ ప్లాప్ మరకను అఖండతో చెరిపేసుకున్నాడు బోయాపాటి.

 

థియేటర్ల విషయంలో.. రిలీజ్ ల విషయంలో ఉన్న సందేహాలను Akhanda సినిమాతో పటాపంచలు  చేశారు బోయపాటి టీమ్. ఇక ఈ రెండు సినిమాలు హిట్ తో.. బన్ని- బోయపాటి కాంబోకు లైన్ క్లియర్ అయినట్టే తెలుస్తోంది. ఇటు Allu Arjun కూడా పుష్ప సినిమాతో ఫస్ట్ డేనే 70 కోట్లకు పైగా కలెక్షన్ తో దూసుకుపోతోంది. భారీ రెస్పాన్స్ తో బన్నీ కూడా ఫుల్ జోష్ మీద ఉన్నాడు.

 

అటు పుష్ప2 షూటింగ్ కు చాలా టైమ్ మిగిలుండటంతో.. ఈ మధ్యలో బోయపాటి సినిమా ఫినిష్ చేసే ఆలోచనలో ఉన్నాడట అల్లు అర్జున్.ఈలోపు ఒక నెల రెస్ట్ కోసం ఫ్యామిలీతో వెకేషన్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు బన్ని. ఆల్ రెడీ వీరి కాంబినేషన్ లో గతంలో సరైనోడు సినిమా వచ్చింది. సూపర్ హిట్ అయ్యింది. ఇక వీరి కాంబినేషన్ లో సెకండ్ మూవీ సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు స్పీడ్ అప్ అయ్యాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు.

Balayya Unstoppable : మిమ్మల్ని డైరెక్ట్ చేయలేను.. బాలయ్య విషయంలో చేతులెత్తేసిన రాజమౌళి

ఇక ఈ సినిమా కథ భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి పూర్వం నడుస్తుందట. ఆ కాలంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన చుట్టూ ఈకథ తిరుగుతుందని సమాచారం. బన్నీకి ఈ కథ ఒక రేంజ్ లో నచ్చేయడంతో... ఆయన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చరట.  పూర్తిస్థాయి స్క్రిప్ట్ పై బోయపాటి కూర్చోనున్నట్టు సమాచారం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు
Annagaru Vostaru:అన్నగారు వస్తారా ? రారా ? బాలకృష్ణ తర్వాత కార్తీ సినిమాకు చుక్కలు చూపిస్తున్న హైకోర్టు