అందుకే మగధీర 100రోజుల వేడుకకు రానని అల్లు అరవింద్ కు చెప్పా

Published : May 27, 2017, 07:11 AM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
అందుకే మగధీర 100రోజుల వేడుకకు రానని అల్లు అరవింద్ కు చెప్పా

సారాంశం

బాహుబలి చిత్రంతో భారతీయులందరిలో దర్శకుడు రాజమౌళికి క్రేజ్ గతంలో రామ్ చరణ్,అల్లు అరవింద్ లతో మగీధీర ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన  జక్కన్న తాజాగా అల్లు అరవింద్ తో విబేధాల వల్లే మగధీర 100 రోజుల వేడుకకు రాలేదన్న రాజమౌళి

బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటారు దర్శక ధీరుడు రాజమౌళి. దేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసిన బాహుబలి చిత్రంలో శ్రీదేవి శివగామిగా నటించక పోవడం తమ టీమ్ చేసుకున్న అదృష్టం అని రాజమౌళి అంటున్నాడు.

 

సినిమాలో ప్రధాన పాత్రలైన బాహుబలి, భళ్లాలదేవ, శివగామి, దేవసేన, కట్టప్ప, బిజ్జలదేవ.. పాత్రల్లో నటించిన వారిలో ప్రతీ పాత్ర ప్రత్యేకమైనదేనని రాజమౌళి చెప్పారు. మొదటగా శివగామి పాత్రకు శ్రీదేవిని అనుకున్నామని ఆయన వివరించారు. ‘డార్లింగ్.. శ్రీదేవి ఉంటే జనానికి మనం కనపడతామా..? ఆమె ముందు ప్రేక్షకులకు మనం ఆనతామా..? అమ్మో మనం చాలా హోమ్‌వర్క్ చేయాలి డార్లింగ్.. తినేస్తుంది.. అందర్నీ తినేస్తుంది..’ అని ప్రభాస్ మాటిమాటికీ అనేవాడని రాజమౌళి అంటున్నారు. అయితే తమ అదృష్టం బాగుండి శ్రీదేవి ఈ పాత్రను ఒప్పుకోలేదంటున్నారు.

 

ఇక గతంలో రాజమౌళి ఇచ్చిన ఇండస్ట్రీ హిట్ మగధీర విషయంలో తనకు నిర్మాత అల్లు అరవింద్ తో విబేధాలు తలెత్తినట్లు చెప్పకనే చెప్పేశాడు రాజమౌళి. రామ్ చరణ్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన  మగధీర విషయంలో నిర్మాత అరవింద్‌పై కోపాలు చాలానే ఉన్నాయనీ, అందుకే 100 రోజుల వేడుకకు రాలేనని ఆయనతో చెప్పానని రాజమౌళి అన్నారు. దీన్ని బట్టి మెగా క్యాంప్ తో రాజమౌళికకి విబేధాలు తలెత్తిన మాట వాస్తవమేనని తేలిపోయింది. అయితే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాత్రం పవన్ కళ్యాణ్ వల్లే బాహుబలి ఇంటర్వెల్ సీన్ కు ప్రేరణ పొందానని, ఆయన కోసం మంచి కథ రాస్తానని చెప్పడం ఆసక్తి కలిగించే అంశం.

 

ప్రభాస్ విషయంలో మాత్రం ఎలాంటి ఒత్తిడి లేదంటున్నారు. తాము ప్రభాస్‌ను ఆటపట్టించడానికి ‘ ఏం ప్రభాస్ రాజు గారు’.. అని పిలిస్తే తెగ ఇబ్బంది పడిపోతాడంటున్నారు.

 

ఇక మహాభారతం తీసే కెపాసిటీ ప్రస్తుతం తనకు ఉందా..? అని తనపై తనకు అనుమానంగా ఉందనీ, దానిపై క్లారిటీ వచ్చాక ఆలోచిస్తానంటున్నారు. ఇప్పట్లో మాత్రం అలాంటి ఆలోచనేం లేదంటున్న రాజమౌళి... ఆంధ్ర జ్యోతి రాధాకృష్ణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడని కథనం.

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా