
దక్షిణాదిలోనే కాక బాలీవుడ్ లో సైతం తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ శృతీహాసన్ సొంతం. వెండితెరపై తన అందాల ఆరబోతతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేసే శృతీ ఇంటర్వ్యూల్లో బోల్డ్‌గా మాట్లాడడానికి అస్సలు వెనుకాడదు. కొంతకాలం క్రితం ఓ మ్యూజిక్ డైరెక్టర్‌ను ప్రేమించానని, అయితే అతనితో సెట్ కాదని తెలిసి తరువాత విడిపోయానని వెల్లడించింది. అతని పేరు మాత్రం చెప్పలేదు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది శృతీహాసన్. ఇప్పుడిప్పుడే పెళ్లి గురించి ఆలోచించడం లేదని, అయితే మనసుకు నచ్చిన అబ్బాయి దొరికితే పెళ్లికి ముందే తల్లి కావడానికి కూడా తనకు అభ్యంతరం లేదని బోల్డ్‌గా చెప్పేసింది. దీంతో ఆ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. శృతీహాసన్ తల్లిదండ్రులు కమల్‌హాసన్, సారికలు కూడా శృతి పుట్టిన తర్వాతే పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు శృతి కూడా ఆ రూట్‌నే ఫాలో కావాలనుకుంటుందేమో!
చలపతిరావును ఏకిపారేస్తున్న మహిళా సంఘాల వాళ్లు మరి శృతి కమెంట్స్ పై ఏమంటారో..