హాలీవుడ్ ఫేమస్ ఫిల్మ్ మేకర్ స్పీల్ బర్గ్ ను కలిసిన జక్కన్న.. ‘దేవుడు’ అంటూ అభిమానాన్ని చాటుకున్న రాజమౌళి!

Published : Jan 14, 2023, 02:03 PM ISTUpdated : Jan 14, 2023, 02:06 PM IST
హాలీవుడ్ ఫేమస్ ఫిల్మ్ మేకర్ స్పీల్ బర్గ్ ను కలిసిన జక్కన్న.. ‘దేవుడు’ అంటూ అభిమానాన్ని చాటుకున్న రాజమౌళి!

సారాంశం

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి (SS Rajamouli) అమెరికాలోని యూనివర్సల్ పార్టీలో ఫ్యాన్ బాయ్ మూమెంట్ దక్కింది. జక్కన్న ఎంతగానో ఇష్టపడే హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ ను కలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.   

‘ఆర్ఆర్ఆర్’తో హాలీవుడ్ ప్రముఖుల నుంచి ప్రశంసలు పొందుతున్నారు  దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli). అమెరికాలోని గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ (Golden Globe) ప్రదానోత్సవ కార్యక్రమంలో ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ మొత్తం పాల్గొంది. అనంతరం లాస్ ఎంజెల్స్ లోని సన్ సెట్ టవర్స్ లో నిర్వహించిన యూనివర్సల్ పార్టీలో రాజమౌళి, కీరవాణి పాల్గొన్నారు. ఈ వేడుకలో జక్కన్నకు ఫ్యాన్ బాయ్ మూమెంట్ దక్కడం విశేషం. హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పిల్ బర్గ్ (Steven spielberg)ను కలిసి తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. రాజమౌళితో పాటు కీరవాణి కూడా ఆయన్ని కలిశారు.

‘జురాసిక్ పార్క్’,‘హుక్’,‘ది టర్మినల్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన స్పిల్ బర్గ్ ను కలిసిన సంతోషాన్ని రాజమౌళి, కీరవాణి సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఆయనతో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ ‘ఇప్పుడే దేవుడిని కలిశాను’ అంటూ రాజమౌళి కామెంట్ చేశారు. ‘గాడ్ ఆఫ్ మూవీస్ గా కొలిచే స్టీవెన్ స్పిల్ బర్గ్ ను కలవడం సంతోషం. ఆయన సినిమాలంటే నాకెంత ఇస్టమో కూడా చెప్పాను. ‘నాటు నాటు’పై ఆయన చెప్పిన మాటల్ని మరిచిపోలేకపోతున్నాను’ అంటూ కీరవాణి ట్వీట్ చేశారు. 

80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ‘నాటు నాటు’ సాంగ్ కు బెస్ట్ ఒరిజినల్ స్కోర్‌గా అవార్డు దక్కింది. మరోవైపు ‘ఆస్కార్స్’కు బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో Naatu Naatu సాంగ్  షార్ట్ లిస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈనెల 12 నుంచి 17 వరకు నామినేషన్లు జరగనున్నాయి. జనవరి 24న నామినేషన్స్ లో నిలిచిన చిత్రాలను ప్రకటించనున్నారు. మార్చి 12న అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?