చావడానికి సిద్థం..ట్రీట్మెంట్ మాత్రం వద్దన్నా.. సంజయ్ దత్ సంచలన వ్యాఖ్యలు

By Mahesh JujjuriFirst Published Jan 14, 2023, 11:41 AM IST
Highlights

బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్త్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్యాన్సర్ బారిన పడిన ఆయన.. దానిపై పెద్ద యుద్దమే చేశారు. ఒక దశలో జీవితం మీద విరక్తి పుట్టిందంటూ బాధపడ్డారు. 

ఫిల్మ్ స్టార్స్ చాలా మందిని మహమ్మారి క్యాన్సర్ బలితీసుకుంది. చాలా మంది తారలు రకరకాల క్యాన్సర్ బారిన పడి మరణించారు. మరికొంత మంది ట్రీట్మెంట్ ద్వారా బ్రతికి బయటపడ్డారు. ఇలా బ్రతికినవారి సంఖ్య చాలా తక్కువ. అయితే కాన్సర్ ను ముందుగానే గుర్తిస్తే.. దానిపై యుద్దం చేయడం చాలా సులువు అని చాలా మంది తారలు నిరూపించారు. ఇందుకు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రత్యక్ష నిదర్శనం.  సంజయ్ దత్ కూడా క్యాన్సర్ బారిన పడ్డారు. 2020 లో ఆయనకు  లంగ్ కేన్సర్ ఉన్నట్టు గుర్తించారు. త్వరగా మేల్కొన్న ఆయన  కీమోథెరపీ చికిత్సతో మహమ్మారి నుంచి బయటపడ్డారు. 

క్యాన్సర్ తో తన అనుభవాలను రీసెంట్ గా ఓ సందర్భంలో వివరించారు సంజయ్ దత్.  ఇటీవలే ఆయన వెల్లడించారు. అది చెప్పలేని నరకం అన్నారుసంజయ్. నాకు వెన్ను నొప్పి వస్తుండేది. వేడి నీటి బాటిల్, నొప్పి నివారణ ఔషధాలతో చికిత్స చేశారు. కానీ, ఒక రోజు నాకు శ్వాస ఆడలేదు. వెంటనే నన్ను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఆ టైమ్ లో నా భార్య కాని.. నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ నా వెంట లేరు. నేను ఒంటరిగా హాస్పిటల్ లో ఉన్నారు. అప్పుడు ఒక కుర్రాడు నా దగ్గరకు వచ్చి మీకు క్యాన్సర్ ఉంది అని చెప్పి  వెంటనే వెళ్లిపోయారు. అది విన్న వెంటనే నా ప్రపంచం తలకిందులయినట్టు అనిపించింది అన్నారుసంజయ్. 

అంతే కాదు  నా కండిషన్ గురించి చెప్పిన తర్వాత కీమోథెరపీ ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నారు. కాని ఆ ట్రీట్మెంట్  తీసుకోవడానికంటే చచ్చిపోవడం నయమని అనుకున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారుసంజయ్ దత్. అంతే కాదు తమ కుటుంబంలోనే క్యాన్సర్ హిస్టరీ ఉంది అన్నారు సంజయ్. మా అమ్మ పాంక్రియాటిక్ కేన్సర్ తో చనిపోయింది. నా భార్య రిచా శర్మ బ్రెయిన్ కేన్సర్ తో  చనిపోయింది. అందుకే నాకు కేన్సర్ అని చెప్పిన వెంటనే కీమో థెరపీ తీసుకోకూడదని అనుకున్నాను అన్నారు సంజయ్ దత్. 

అంతే కాదు  ఒకవేళ చనిపోతే చనిపోనీ.. ట్రీట్మెంట్ లో కలిగే బాధకంటే.. చనిపోవడం చాలా ప్రశాంతం అనుకున్నాను అననారు సంజయ్ దత్. కాని సంజయ్ దత్ ప్యామిలీ ఆయనకు సపోర్ట్ గా నిలబడ్డారు. ముఖ్యంగా ఆయన భార్య మాన్యతా దత్, చెల్లెల్లు ప్రియా దత్, నమ్రతా దత్ ఆయనకు అండగా నిలబడ్డారు. వెన్నంటే ఉండి ధైర్యం చెప్పారు. వాటితో పాటు తన పిల్లలకు తాను దూరం అవుతాను అన్న బాధ సంజయ్ దత్ ను ట్రీట్మెంట్ తీసుకునేలా చేసింది. ఆత్మవిశ్వాసానికి చికిత్స తోడై ...మహమ్మారి నుంచి బయట పడ్డాడు సంజయ్ దత్.  


 

click me!