టాలీవుడ్ హీరో నితిన్ (Nithiin) మరో ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అయితే, నితిన్ సరసన రష్మిక మందన్న మరోసారి నటించబోతుందని టాక్. ఈ చిత్ర దర్శకుడు, నిర్మాణ సంస్థ, షూటింగ్ డిటేయిల్స్ ఇంట్రెస్టింగ్ ఉన్నాయి.
‘మాచెర్ల నియోజకవర్గం’తో ఆకట్టుకోలేకపోయిన టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మంచి కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై మరింత శ్రద్ధ చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేస్తున్నారు. ఈమధ్యనే షూటింగ్ సైతం ప్రారంభం అయినట్టు తెలుస్తోంది. ఇక తాజాగా మరో ప్రాజెక్ట్ కూడా త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
2020లో ‘భీష్మ’తో నితిన్ డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. నేషనల్ క్రష్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) నితిన్ సరసన నటించింది. ఈ పేయిర్ అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా మెప్పించింది. దీంతో మరోసారి వీరిద్దరూ జంటగా అలరించబోతున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఛలో, భీష్మ చిత్రాలతో హిట్లు అందుకున్న వెంకీ కుడుముల నెక్ట్స్ మూవీ నితిన్ తోనే అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో రష్మిక మందన్ననే హీరోయిన్ గా నటించబోతున్నారని అంటున్నారు. ఇంకా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన అందలేదు.
‘భీష్మ’ తర్వాత వెంకీ కుడుముల చిరంజీవితో ఓ సినిమా చేయబోతున్నారని టాక్ నడిచింది. కానీ ప్రస్తుతం మళ్లీ నితిన్ తోనే సినిమా అంటున్నారు. నితిన్ 33వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానున్నందని తెలుస్తోంది. చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కించనున్నారని సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించారంట. ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి తీసుకెళ్లెందుకు ప్లాన్ చేస్తున్నారంట. ఈ మేరకు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుండటం నితిన్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఆసక్తిని పెంచుతోంది.