కోటి రూపాయల బీఎండబ్లూ కారు కొన్న రాజమౌళి

Published : Jun 19, 2017, 05:38 PM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
కోటి రూపాయల బీఎండబ్లూ కారు కొన్న రాజమౌళి

సారాంశం

బాహుబలి రికార్డు కలెక్షన్స్ తో దర్శక నిర్మాతలకు కాసులపంట ఇటీవలే ఫామ్ హౌజ్ కోసం 100 ఎకరాలు కొన్న రాజమౌళి తాజాగా కోటి రూపాయల బీఎండబ్లూ 7 సిరీస్ లగ్జరీ కారు కొనుగోలు చేసిన జక్కన్న

బాహుబలి సినిమా సాధించిన చారిత్రాత్మక విజయం తెలుగు సినిమా కీర్తి పతాకను ప్రపంచం నలుమూలలా ఎగరేయటమే కాక.. నిర్మాతలకు కాసుల పంట పండించింది. దేశంలోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా బాహుబలి రికార్డు సాధించింది. ఇప్పటి వరకు ఆమీర్ ఖాన్ దంగల్ చైనా తదితర దేశాల్లో కకలుపుకుని సాధించిన కలెక్షన్స్ తప్ప ఒక్క భారతదేశం తీసుకుంటే బాహుబలి హిందీలో నంబర్ వన్. బాహుబలి నంబర్ వన్ గా నిలవటంతో నిర్మాతలకు కాసుల పంట పండింది. ఇంత అని బయటికి తెలియదు కానీ బాహుబలి దాదాపు 800 కోట్ల షేర్ సాధించిందని అంచనా.

అయితే ఈ షేర్ దక్కించుకున్న నిర్మాతలు దర్శకుడు రాజమౌళికి కూడా లాభాల్లో మంచి వాటానే ఇచ్చారు. ఒప్పందం ప్రకారం రాజమౌళికి బాగానే గిట్టిందని సమాచారం. దీంతో ఇప్పటికే జక్కన్న హైదరాబాద్ పరిసరాల్లో 100ఎకరాల్లో ఫామ్ హౌజ్ నిర్మాణానికి శ్రీకారం  చుట్టాడు. అంతేకాదు జక్కన్న తాజాగా కోటి రూపాయలు ఖరీదైన బీఎండబ్ల్యూ కారు కూడా కొనుగోలు చేశాడు.

బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారు కొనుగోలు చేసిన రాజమౌళి తాజాగా తన సతీమణి రమా రాజమౌళితో కలిసి షో రూం నుంచి ఆ కారును తీసుకెళ్లారు. ప్రస్థుతం రిలాక్స్ మోడ్ లో ఉన్న రాజమౌళి లగ్జురీ కారు కొనుగోలు చేశాడు. ఇక తన తదుపరి ప్రాజెక్ట్ పై ఇప్పటి వరకు క్లారిటీ అయితే రాలేదు. అయితే రాజమౌళికి ఇష్టమైన హీరోలల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ తోనే తదుపరి ప్రాజెక్ట్ ఉంటుందని ఫిలింనగర్ కోడొ కూస్తోంది. మరి జక్కన్న ఏ ప్రాజెక్ట్ చేపడతాడో చూడాలి.

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి