`వాసుకి` చిత్రానికిగానూ ఫిలింఫేర్ అవార్డ్ అందుకున్న న‌య‌న‌తార‌

Published : Jun 19, 2017, 05:29 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
`వాసుకి` చిత్రానికిగానూ ఫిలింఫేర్ అవార్డ్ అందుకున్న న‌య‌న‌తార‌

సారాంశం

వాసుకి చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన నయనతార మళయాళ చిత్రం పుదియ నియమం చిత్రమే తెలుగులో వాసుకి ఈ చిత్రంలో మహిళల హక్కుల కోసం పోరాడే పాత్రలో నయన్

స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం `వాసుకి`. మ‌ల‌యాళ చిత్రం `పుదియ నియ‌మం` చిత్రానికి అనువాద చిత్రంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాలో న‌య‌న‌తార న‌ట‌న‌కు ఈ ఏడాది ఫిలింఫేర్ ఉత్త‌మ‌న‌టి అవార్డును న‌య‌న‌తార సొంతం చేసుకున్నారు. మ‌హిళ‌ల‌పై జ‌ర‌గుతున్న అకృత్యాల‌కు వ్య‌తిరేకంగా పోరాడే ఓ స్త్రీ క‌థాంశంతో వాసుకి సినిమా రూపొందింది. మ‌ల‌యాళంలో ఈ చిత్రం సెన్సేష‌న‌ల్ హిట్ సాధించింది. `వాసుకి` పేరుతో శ్రీ‌రామ్ సినిమా ప‌తాకంపై ఎస్‌.ఆర్. మోహ‌న్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ చిత్ర ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుండి హ్యుజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. లీడ్ రోల్ న‌య‌న‌తార చేయ‌డంతో పాటు ప్ర‌స్తుతం స‌మాజంలో జ‌రుగుతున్న స‌మ‌స్య కావ‌డంతో సినిమాపై మంచి క్రేజ్ నెల‌కొంది. డిస్ట్రిబ్యూట‌ర్స్ కూడా సినిమాపై ఆస‌క్తిని క‌న‌ప‌రుస్తున్నారు. 

 

న‌య‌న‌తార‌కు ఫిలింపేర్ అవార్డు రావ‌డం ఎంతో సంతోషంగా ఉంది. మ‌ల‌యాళంలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయిన ఈ చిత్రానికి తెలుగులో మంచి క్రేజ్ నెల‌కొంది. త‌ప్ప‌కుండా తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే చిత్ర‌మవుతుందని నిర్మాత ఎస్‌.ఆర్‌.మోహ‌న్ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి