
బిగ్ బాస్ సీజన్ 6 నేటి ఎపిసోడ్ లో కూడా కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కెప్టెన్సీ టాస్క్ జరిగింది. శ్రీహాన్, ఇనయ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మిషన్ పాజిబుల్ టాస్క్ ని నేటితో బిగ్ బాస్ ముగించారు.
మిషన్ పాజిబుల్ టాస్క్ చివర్లో పెద్ద రసాభాస జరిగింది. టాస్క్ లో ఇంటి సభ్యులు ఫిజికల్ గా వెళ్లారు. అసలే ఇనయ, శ్రీహాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటోంది. ఇక వారు ఫిజికల్ కావడంతో గొడవ ఇంకా పెద్దదైంది. శ్రీహాన్ కాలితో తంతున్నాడు అంటూ ఇనయ ఆరోపించింది. ఇదేనా నీ మగతనం అంటూ రెచ్చగొట్టింది. టాస్క్ అయ్యే వరకు శ్రీహాన్ ఏమీ మాట్లాడలేదు.
ఇనయ పదేపదే మగతనం గురించి మాట్లాడుతుంటే గీతూ, ఇతర ఇంటి సభ్యులు ఆమెని మందలించారు. ఇక టాస్క్ లో ఆది రెడ్డి మైక్ విసిరి కొట్టడంతో బిగ్ బాస్ అతడిని డిస్ క్వాలిఫై చేసారు. చివరికి మిషన్ పాజిబుల్ టాస్క్ డ్రాగా ముగిసింది.
అనంతరం బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ నిర్వహించారు. కెప్టెన్సీ టాస్క్ బరిలో జీతూ, ఫైమా, శ్రీసత్య, వాసంతి, ఇనయ, మెరీనా పాల్గొన్నారు. బిగ్ బాస్ వీరందరికి బెలూన్స్ ఇచ్చి గార్డెన్ ఏరియాలో నిల్చోమన్నారు. టాస్క్ మొదలయ్యాక ఒకరి బెలూన్ లని మరొకరు పగలగొట్టాలి. ఎవరి బెలూన్స్ ని వారు రక్షించుకోవాలి. ఈ క్రమంలో చివరికి ఎవరి చేతులో బెలూన్ సురక్షితంగా ఉంటుందో వారే ఈవారం కెప్టెన్ గా ఎంపిక అవుతారు.
ఈ టాస్క్ లో శ్రీసత్య విజయం సాధించి హౌస్ కి కొత్త కెప్టెన్ గా అవతరించింది. దీనితో బిగ్ బాస్, ఇంటి సభ్యులు ఆమెని అభినందించారు.