వెంటిలేటర్ పై ప్రముఖ నటి.. రెండు సార్లు క్యాన్సర్ తో పోరాడి గెలిచి.. ఇప్పుడు మళ్ళీ విషమం

Published : Nov 04, 2022, 10:15 PM ISTUpdated : Nov 04, 2022, 10:22 PM IST
వెంటిలేటర్ పై ప్రముఖ నటి.. రెండు సార్లు క్యాన్సర్ తో పోరాడి గెలిచి.. ఇప్పుడు మళ్ళీ విషమం

సారాంశం

ప్రముఖ బెంగాలీ నటి ఐంద్రీలా శర్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. వెండి తెరపై ఆమె అందమైన నటి. కానీ నిజ జీవితంలో పోరాట యోధురాలు అనే చెప్పాలి. ఒక సారి క్యాన్సర్ సోకితేనే కోలుకోవడం కష్టంగా ఉంటుంది. కానీ రెండు సార్లు ఆమెని క్యాన్సర్ చుట్టుముట్టినా పోరాడి గెలిచింది.

చిత్ర పరిశ్రమలో నటీనటుల ఆరోగ్యం గురించి అనేక వార్తలు వింటుంటాం. కొన్ని సార్లు వారి ఆరోగ్య పరిస్థితి అభిమానులకు షాకింగ్ గా మారుతుంది. ఇటీవల సమంత మయోసైటిస్ అనే ప్రమాదకర వ్యాధికి గురైన సంగతి తెలిసిందే. అయితే సమంత కోలుకుంటుండడం ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. ఇది పక్కన పెడితే ప్రముఖ బెంగాలీ నటి ఐంద్రీలా శర్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. 

వెండి తెరపై ఆమె అందమైన నటి. కానీ నిజ జీవితంలో పోరాట యోధురాలు అనే చెప్పాలి. ఒక సారి క్యాన్సర్ సోకితేనే కోలుకోవడం కష్టంగా ఉంటుంది. కానీ రెండు సార్లు ఆమెని క్యాన్సర్ చుట్టుముట్టినా పోరాడి గెలిచింది. తిరిగి బుల్లితెరపై నటిగా వెలిగింది. క్యాన్సర్ అడ్డుకట్ట వేసింది కానీ.. ఆమె అందమైన రూపానికి ఇంకా సినిమా ఆఫర్స్ వచ్చి ఉండేవి. 

ఇప్పుడు మళ్ళీ ఆమె ఆరోగ్యం తిరగబెట్టింది. ప్రస్తుతం ఐంద్రీలా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైద్యులు ఆమెని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల స్ట్రోక్ రావడంతో ఆమె ఆసుపత్రిలో చేరారు. 

వెంటనే పక్షవాతం రావడం, మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ఆమె కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు వివరించారు. చిన్న వయసులోనే ఆమెకి ఈ పరిస్థితి తలెత్తడంతో అభిమానులు దుఃఖంలో మునిగిపోయారు. అద్భుతం జరగాలని, ఆమె ఆసుపత్రి నుంచి ఆరోగ్యంగా రావాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఢిల్లీ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో ఆమెకి చికిత్స జరుగుతోంది. 

PREV
click me!

Recommended Stories

రామ్ పోతినేని కి పెళ్లంటే ఇష్టం లేదా..? బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడా? మ్యారేజ్ పై ఎనర్జిటిక్ స్టార్‌ కామెంట్స్..
OTT: జీవితానికి రీసెట్ బటన్ ఉండదు.. ఈ తరం వారి కళ్లు తెరిపించే సినిమా. ఓటీటీలో స్ట్రీమింగ్