విశ్వరూపం చూపించిన శ్రీరామచంద్ర.. ఆర్జే కాజల్‌కి మైండ్‌ బ్లాక్‌..

Published : Sep 14, 2021, 11:38 PM IST
విశ్వరూపం చూపించిన శ్రీరామచంద్ర.. ఆర్జే కాజల్‌కి మైండ్‌ బ్లాక్‌..

సారాంశం

దాన్నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. 9వ రోజు హౌజ్‌లో కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. నిన్నటి(సోమవారం) విభజించినట్టుగానే రెండు టీమ్‌లు ఇందులో పాల్గొనాల్సి ఉంది. ఈగల్‌ టీమ్‌కి శ్రీరామచంద్ర సంచాలకుడిగా వ్యవహరించగా, వోల్ఫ్‌ టీమ్‌కి మానస్‌ సంచాలకులుగా ఉన్నారు. 

బిగ్‌బాస్‌5 తెలుగు రెండో వారం రసవత్తరంగా సాగుతుంది. నామినేషన్స్ ప్రక్రియలోనే హీట్‌ పెంచేశారు. గేమ్‌ సీరియస్ మూడ్‌లోకి వెళ్లిపోయింది. ఒకరిపై ఒకరు అరుచుకోవడం, విమర్శలు, ఆరోపణలు చేయడంతో బిగ్‌బాస్‌ షో హీటెక్కిపోయింది. దాన్నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. 9వ రోజు హౌజ్‌లో కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. నిన్నటి(సోమవారం) విభజించినట్టుగానే రెండు టీమ్‌లు ఇందులో పాల్గొనాల్సి ఉంది. 

ఈగల్‌ టీమ్‌కి శ్రీరామచంద్ర సంచాలకుడిగా వ్యవహరించగా, వోల్ఫ్‌ టీమ్‌కి మానస్‌ సంచాలకులుగా ఉన్నారు. ఇందులో తమ టీమ్‌ సింబల్‌కి చెందిన ఫ్లాగ్‌లను ఎక్కువగా సంపాదించిన వాళ్లు విన్నర్‌గా ఉంటారని, విన్నర్‌కి ఫ్లాగ్‌ దక్కుతుందని చెప్పారు బిగ్‌బా. ఈ టాస్క్ లో రెండు జట్లు రెచ్చిపోయాయి ఆడాయి. ఒకరిపై ఒకరు పడ్డారు, కొట్టుకున్నారు, లాక్కున్నారు. నానా హంగామా చేశారు. డైరెక్ట్ గా కొట్టుకునే స్టేజ్‌కి వెళ్లారు. 

అయితే అందులో భాగంగా `దొంగలున్నారు జాగ్రత్త` టాస్క్ లో హోరా హోరీగా గేమ్‌ ఆడారు. అయితే ఈ టాస్క్ కి బ్రేక్‌ ఇచ్చారు బిగ్‌బాస్‌. `సాగరా సోదరా` అంటూ బ్రేక్‌ ఇచ్చారు. దీంట్లో రెండు జట్ల వాళ్లు తాము సంపాదించిన ఫ్లాగ్‌లను ఓ చోట పెట్టుకోవాల్సి ఉంటుంది. వాటిని మరొకరు ముట్టుకోవడానికిగానీ, తీసుకోవడానికి వీల్లేదు. అందులో భాగంగా వోల్ఫ్‌ టీమ్‌ నుంచి సన్నీ వచ్చి తాను సంపాదించిన ఫ్లాగ్‌ని పెట్టానని, అది ఇవ్వాలని తెలపగా, దాన్ని ఈగల్‌ టీమ్‌కి చెందిన సిరి తీసుకుంది. 

దీనిపై రెండు జంట్ల మధ్య గొడవ స్టార్ట్ అయ్యింది. అయితే వోల్ఫ్‌ టీమ్‌ నుంచి కాజల్‌ వాదిస్తుండగా, ఈగల్‌ టీమ్‌ లీడర్‌ శ్రీరామచంద్ర రెచ్చిపోయారు. ఆమెపై ఫైర్‌ అయ్యారు. మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నావంటూ ఫైర్‌ అయ్యాడు. మీ సంచాలకుడు మాట్లాడనివ్వు, నువ్వెందుకు వస్తున్నావంటూ మండిపడ్డాడు. ఆమెపై గట్టిగా అరిచాడు. ప్రతి సారి మధ్యలో ఇన్‌వాల్వ్ అవుతుందని, తనకు అడ్డు వస్తుందని గట్టిగా అరిచాడు శ్రీరామచంద్ర. దీంతో కాజల్‌కి మైండ్‌ బ్లాక్‌ అయిపోయింది. కాజల్‌కే కాదు, అక్కడున్న అందరికి మతిపోయినట్టయ్యింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్