రెజీనా కసాండ్రా ద్విపాత్రాభినయం.. అదరహో అనిపిస్తున్న `నేనే నా?` ట్రైలర్‌

Published : Sep 14, 2021, 06:30 PM IST
రెజీనా కసాండ్రా ద్విపాత్రాభినయం.. అదరహో అనిపిస్తున్న `నేనే నా?` ట్రైలర్‌

సారాంశం

రెజీనా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రాణిగా, ఆర్కియాలజిస్ట్ గా కనిపించబోతుంది. పీరియడ్‌ కథతో సినిమా సాగుతుందని తెలుస్తుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. నిధి అగర్వాల్‌, విజయ్‌ సేతుపతి, లింగుస్వామి విడుదల చేశారు.

రెజీనా కసాండ్రా మెయిల్‌ లీడ్‌గా నటిస్తున్న చిత్రం `నేనే నా?`. తెలుగు, తమిళంలో రూపొందుతున్న చిత్రమిది. కార్తీక్‌ రాజు దర్శకత్వం వహించారు. రాజశేఖర్‌ వర్మ తన ఆపిల్‌ ట్రీ స్టూడియోస్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇందులో రెజీనా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రాణిగా, ఆర్కియాలజిస్ట్ గా కనిపించబోతుంది. పీరియడ్‌ కథతో సినిమా సాగుతుందని తెలుస్తుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. నిధి అగర్వాల్‌, విజయ్‌ సేతుపతి, లింగుస్వామి విడుదల చేశారు. 

ట్రైలర్‌ చూస్తుంటే ఇది వందేళ్ల క్రితం జరిగిన ఒక భయంకరమైన సంఘటనని ఇప్పుడు చూపించబోతున్నట్టు తెలుస్తుంది. రెజీనా వందేళ్ల క్రితం రాణి అయితే, ఇప్పుడు ఆమె పురావస్తు శాస్త్రవేత్తగా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఓ మిస్టీరియస్‌ కేసుని ఛేదించబోతున్నట్టు ట్రైలర్‌ని చూస్తే అర్థమవుతుంది. గతం, ప్రస్తుతం మధ్య లింకులను ఆసక్తికరంగా సాగబోతున్నట్టు, హర్రర్‌ ఎలిమెంట్లు, కామెడీ మేళవింపుగా ఇది సాగుతుందని తెలుస్తుంది. 

సినిమాకి సామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తున్నారు. గోకుల్‌ బెనాయ్‌ సినిమాటోగ్రఫీగా పనిచేస్తున్నారు. రెజీనాతోఆపటు వెన్నెల కిషోర్‌, అక్షర గౌడ, తాగుబోతు రమేష్‌, జయప్రకాష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుందని నిర్మాతలు తెలిపారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి నడిచొచ్చే కొడుకు.. రోహిణీ గతం బయటపడుతుందా? బాలుకి అబద్ధం చెప్పిన మీనా
Bigg Boss Telugu Winners : టైటిల్ గెలిచారు కానీ.. ఉపయోగం లేదు, బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?