
బుల్లితెర హాట్ స్టార్స్ లో ఒకరిగా దూసుకెళ్తున్న హాట్ యాంకర్ శ్రీముఖికి వెండితెరపై ఇంకా మంచి బ్రేక్ రాలేదు. అడపాదడపా కేరక్టర్స్ చేస్తున్నా... తాను ఆశించిన స్థాయిలో ఫలితం మాత్రం రాలేదు. ఇప్పటికే అనసూయ లాంటి యాంకర్ స్పెషల్ సాంగ్ లతో కుర్రకారుకు కిక్కెక్కిస్తోంది. మరోవైపు తన టీవీ షోలతో కుర్రకారును గిలిగింతలు పెడుతున్న శ్రీముఖి వెండి తెరపై మాత్రం ఇంకా సరిగ్గా మెరవలేదు.
తన ఖర్మ కాకుంటే ఓ సూపర్ బంపర్ ఆఫర్ వచ్చి మరీ... తిరిగి వెళ్లిపోయింది. పాపం శ్రీముఖి. ఇంతకీ విషయం ఏంటంటే... మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రంలో ఓ ఐటెం సాంగ్ కోసం శ్రీముఖిని తీసుకున్నారట. అయితే రెండు మూడు రోజులు షూటింగ్ జరిగాక వరుణ్ తేజ్ పక్కన శ్రీముఖి మ్యాచ్ కావట్లేదని పక్కన పెట్టినట్టు సమాచారం.
ఇంతకీ ప్రాబ్లెం ఏంటంటే... శ్రీముఖి హైట్ వరుణ్ తేజ్ పక్కన సరిపోవట్లేదట. శ్రీముఖి చాలా పొట్టిగా ఉండటమే కాకుండా కాస్త బొద్దుగా కూడా కనిపిస్తుంది. మిస్టర్ హీరో వరుణ్ తేజ్ పొడవు ఆరడుగుల కంటే ఎక్కువ. వారిద్దరిని కలిపి ఐటం సాంగ్ తీస్తే బాగుండదనే అభిప్రాయం వ్యక్తమవ్వడంతో శ్రీముఖిని తప్పించినట్టు సమాచారం. అలా శ్రీముఖి ఎత్తు పుణ్యామా అని గ్లామర్ పాళ్లు ఎన్నున్నా... దెబ్బయిపోయింది.
ఇక శ్రీముఖి స్థానంలో ఆ ప్రత్యేకమైన పాట కోసం బాహుబలిలో మనోహరి పాటలో కనిపించిన మోడల్‌ను ఖారారు చేసారట.
శ్రీముఖి ప్రస్థుతానికి అవసరాలతో హంటర్ చిత్రానికి రీమేక్‌గా వస్తున్న బాబు బాగా బిజీ అనే సినిమాలో హాట్ హాట్‌గా కనిపించనుంది. ఇప్పటికే అవసరాలతో మోతాదుకు మించిన శృంగారం ఒలకబోసినట్టు ఇటీవల విడుదలైన సన్నివేశాల్లో స్పష్టమైంది. మరి శ్రీముఖి ఏ మేరకు అందాలు కనువిందు చేస్తుందో చూడాలి.,