బాబు బాగా బిజీలో 'టీవీ పాప హాట్ సీన్స్.. లేవంటే నమ్ముతారా

Published : Mar 23, 2017, 10:26 AM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
బాబు బాగా బిజీలో 'టీవీ పాప హాట్ సీన్స్.. లేవంటే నమ్ముతారా

సారాంశం

అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో బాబుబాగా బిజీ ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో నటిస్తున్న యాంకర్ శ్రీముఖి హాట్ సీన్స్ ఉంటాయని మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం

టెలివిజన్‌ స్టార్గా బాగా పాపులారిటీ సంపాదించిన యాంకర్ శ్రీముఖి సినిమాల్లో కూడా అప్పుడప్పుడు కొన్ని ముఖ్య పాత్రల్లో కనిపిస్తూ వుంది. నటిగా, యాంకర్‌గా ఫుల్ ఇమేజ్‌ తెచ్చుకున్న శ్రీముఖి 'బాబు బాగా బిజీ'లాంటి అడల్ట్‌ సినిమాలో నటించడానికి అంగీకరించడమే షాకిచ్చింది. బాబు బాగా బిజీలో హీరో సెక్స్‌ అడిక్ట్‌. కనిపించిన అమ్మాయిలందరితో సెక్స్‌ కావాలని కోరుకుంటాడు. బాలీవుడ్‌లో హిట్‌ అయిన హంటర్‌ అనే చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.

 

బాబు బాగా బిజీ మూవీలో శ్రీముఖి చాలా హాట్‌ సీన్లు చేసిందని, ఆమెకి ఈ చిత్రం తర్వాత డిఫరెంట్‌ ఇమేజ్‌ వచ్చేస్తుందని మీడియాలో రకరకాలుగా కథనాలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలన్నింటినీ శ్రీముఖి ఖండించింది. సినిమాలో తాను హాట్ సీన్స్ లో చేశానని వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని, తాను అలాంటి సీన్లేమీ చేయలేదని, తన పాత్ర చాలా గౌరవప్రదంగా వుంటుందని, హీరోకి దిశానిర్ధేశం చేసేలాగుంటుందే తప్ప తనపై అభ్యంతరకరమైన సన్నివేశాలుండవని చెప్పింది. 



హంటర్‌ చిత్రాన్ని యథాతథంగా రీమేక్‌ చేసినట్టయితే శ్రీముఖికి ఏ పాత్ర ఆఫర్‌ చేసారనేది ఆసక్తికరమే. ఎందుకంటే ఇందులో హీరోయిన్‌తో మినహా మిగిలిన అందరితోను హీరో వేషాలేస్తూనే కనిపిస్తాడు. శ్రీముఖి హీరోయిన్‌ క్యారెక్టర్‌ చేయలేదు కనుక తనకి ఏ క్యారెక్టర్‌ ఇచ్చారో, ఆ సన్నివేశాలు ఎలా చిత్రీకరించారో చూడాలి మరి.

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్