Thalapathy 66: శ్రీకాంత్, సంగీత...  విజయ్ 66లో జాయిన్ అవుతున్న భారీ క్యాస్ట్

Published : May 10, 2022, 07:27 PM ISTUpdated : May 10, 2022, 08:49 PM IST
Thalapathy 66: శ్రీకాంత్, సంగీత...  విజయ్ 66లో జాయిన్ అవుతున్న భారీ క్యాస్ట్

సారాంశం

దిల్ రాజు ప్రొడక్షన్ లో భారీగా తెరకెక్కుతుంది తలపతి విజయ్ 66వ చిత్రం. రెగ్యులర్ షూటింగ్ కి సిద్ధమైన ఈ అన్ టైటిల్డ్ మూవీలో భారీ క్యాస్ట్ జాయిన్ అవుతున్నారు. ఈ క్రమంలో అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.


టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamshi Paidipalli) లేటుగా ప్రకటించినా భారీ ప్రాజెక్ట్ ప్రకటించారు. మహర్షి మూవీ తర్వాత మహేష్ కోసం ఎదురుచూసిన వంశీకి నిరాశే ఎదురైంది. సరిలేరు నీకెవ్వరు తర్వాత వంశీతో చేయాల్సిన మూవీ చివరి నిమిషంలో హోల్డ్ లో పడింది. అనూహ్యంగా మహేష్ వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ పక్కనపెట్టి పరుశురామ్ కి పచ్చజెండా ఊపారు. ఇక దిల్ రాజు కోసం విజయ్ మూవీని ఆయన లైన్ లో పెట్టారు. విజయ్ 66వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ అధికారిక ప్రకటన చాలా కాలం క్రితమే జరిగింది. ఇక ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలుకానుంది. ఫస్ట్ షెడ్యూల్ షూట్ కోసం విజయ్ హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం. 

కాగా విజయ్(Vijay) కి జంటగా రష్మిక మందాన చేస్తున్న విషయం తెలిసిందే. కెరీర్ లో మొదటిసారి విజయ్-రష్మిక కలిసి నటిస్తున్నారు. కాగా ఈ మూవీలో భారీ క్యాస్ట్ నటిస్తున్నట్లు తెలుస్తుండగా మేకర్స్ నటులను పరిచయం చేశారు. సంయుక్త మరో హీరోయిన్ గా తలపతి 66 (Thalapathy 66) లో జాయిన్ అయ్యారు. అలాగే ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, ప్రభు, జయసుధ వంటి స్టార్ క్యాస్ట్ ఈ మూవీలో భాగం అవుతున్నారు.  సీనియర్ హీరోయిన్ సంగీతతో పాటు నటుడు శ్రీకాంత్, స్టార్ కమెడియన్ యోగి, కిక్ శ్యామ్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మేరకు నిర్మాతలు అధికారిక పోస్టర్స్ విడుదల చేశారు. 

ఇటీవల శ్రీకాంత్ వరుసగా విలన్ రోల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ తో శ్రీకాంత్ తలపడే అవకాశం లేకపోలేదు. శ్రీకాంత్ విలన్ గా నటించిన లేటెస్ట్ మూవీ అఖండ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం సమకూర్చనున్నారు. ఈ చిత్ర టైటిల్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. 

విజయ్ గత చిత్రం బీస్ట్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో ఈ మూవీ దారుణమైన వసూళ్లు అందుకుంది. ఈ క్రమంలో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. విజయ్ గత చిత్రాల మాదిరి తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మూవీ విడుదలయ్యే అవకాశం కలదు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా