యాంకర్ శ్రీముఖి బర్త్ డే ట్రీట్ అదిరింది.. చిరు సాంగ్ కు రాములమ్మ మాస్ స్టెప్పులు

Published : May 10, 2022, 06:40 PM ISTUpdated : May 10, 2022, 06:51 PM IST
యాంకర్ శ్రీముఖి బర్త్ డే ట్రీట్ అదిరింది.. చిరు సాంగ్ కు రాములమ్మ మాస్ స్టెప్పులు

సారాంశం

బుల్లితెర బ్యూటీ, యాంకర్ శ్రీముఖి తన బర్త్ డే సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా జరుపుకుంది. ఈ సందర్భంగా బంధుమిత్రులు తమ బెస్ట్ విషెస్ తెలిపారు. తాజాగా సెలబ్రేషన్స్ ఫొటోలను తన అభిమానులతో పంచుకుందీ రాములమ్మ.   

‘పటాస్’ కామెడీ షోతో శ్రీముఖి తెలుగు టెలివిజన్ ఆడియెన్స్ కు దగ్గరైంది. ఈ షోతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బుల్లి తెర రాములమ్మగా పేరొందింది. మరోవైపు సినిమాల్లోనూ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘జులాయి’ సినిమాలో బన్నీ చెల్లులు పాత్ర పోషించిన శ్రీముఖి అప్పటి నుంచి ఏదోక సినిమాలో కనిపిస్తూనే వస్తోంది. ఇలా అటు బుల్లితెరపై పలు షోలతో నవ్వులూ పూయిస్తూనే.. మరోవైపు బిగ్ స్క్రీన్ పై మెరిసేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు  శ్రీముఖి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా  ఉంటుంది. తన అభిమానులు ఎప్పుడూ  దగ్గరగా ఉంటుంది.

ఈ సందర్భంగా తాజాగా తన పుట్టిన రోజు వేడుకలను సంబంధించిన ఫొటోలను ఇన్ స్టా వేదికన పంచుకుంది. ఈ ఫొటోల్లో శ్రీముఖి తన బంధుమిత్రల మధ్య కేక్ కట్ చేస్తూ చాలా ఆనందంగా కనిపించింది. ఈ ఏఢాదితో 29వ ఏట అడుగెడుతున్నట్టు తెలిపింది. తన సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. తన సోదరుడు, అమ్మ, స్నేహితుల మధ్య పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంది. ఆ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

ఫొటోలను షేర్ చేస్తూ ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది. మెగా స్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ (Acharya)లోని ‘భలే భలే బంజారా’ సాంగ్ కు మాస్ స్టెప్పులేసి ఫ్యాన్స్ కు బర్త్ డే ట్రీట్ ఇచ్చింది. శ్రీముఖి చిరు అప్ కమింగ్ ఫిల్మ్ ‘భోళా శంకర్’లో  నటిస్తోంది. దీంతో తన అభిమానులు ఖుషీ అవుతున్నారు. పోస్ట్ కు నెటిజన్లు రిప్లై ఇస్తూ కామెంట్ సెక్షన్ లో ‘బర్త్ డే విషెస్’ తెలుపుతున్నారు. శ్రీముఖి ప్రస్తుతం జీ5లో ప్రసారమవుతున్న ‘సరిగమప : ది సింగింగ్ సూపర్ స్టార్’ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తోంది.

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా