
దర్శకుడు పరుశురాం పెట్ల డైరెక్షన్ లో వస్తున్న యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రం ఫస్ట్ లో మామూలుగా సినిమాగానే వచ్చినా.. ట్రైలర్ రిలీజ్ తర్వాత సీన్ మారింది. ఒక్కసారిగా ప్రేక్షకుల అటెన్షన్ ను డ్రా చేసింది. ట్రైలర్ లో పోకిరి తరహాలో టేకింగ్ ఉండటంతో మహేశ్ బాబు ఫ్యాన్స్, ఆడియెన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా గత కొద్ది రోజులుగా చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ఇంటర్వ్యూలు, పలు ఈవెంట్లతో ఎక్కువ రీచ్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పెద్ద హీరోల సినిమాలేవి లేకపోవడం, మహేశ్ బాబును బీట్ చేసే హీరోల చిత్రాలు ఈ నెలలో షెడ్యూల్ కాకపోవడంతో ప్రస్తుతం అందరి చూపు Sarkari Vaari Paata మూవీపైనే ఉంది. దీనితోడు చిత్ర యూనిట్ కూడా సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్నారు. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (Thaman) అదిరిపోయే మ్యూజిక్ అందించారు.
ఇప్పటికే కళావతి, పెన్నీ, టైటిల్ సాంగ్, మ.. మ.. మ మహేశా సాంగ్స్ తో సినిమా హైప్ ను పెంచారు. మ్యూజిక్ ట్రాక్స్ తోనే సినిమా ఓ రేంజ్ లో జనాల్లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఎక్కడ చూసిన సర్కారు వారి పాట టాకే వినిపిస్తోంది. ఈ సందర్భంగా థమన్ మరో అదిరిపోయే అప్డేట్ అందించారు. చిత్రం నుంచి ‘ర్యాప్ సాంగ్’ కూడా రిలీజ్ చేసేందుకు అంతా సిద్ధం చేసినట్టు తెలిపారు. సినిమాలోని కొన్ని సీన్స్ తో ఈ సాంగ్ రిలీజ్ కానున్నట్టు తెలిపారు. హై వాల్యూమ్ పెట్టుకొని రెడీ ఉండండి అని అప్డేట్ అందించారు.
అయితే ఈ ర్యాప్ సాంగ్ కు సంబంధించిన ప్రోమోను కూడా జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. ప్రోమో 01తో రిలీజ్ అయిన ఈ క్లిప్ అతి కొద్ది సమయంలోనే 2 లక్షల వ్యూస్ ను దక్కించుకుంది. రేపు ఫుల్ సాంగ్ రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా మహేశ్ బాబు కేరీర్ లోనే ఇది బెస్ట్ ర్యాప్ సాంగ్ గా నిలవనుంది. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) నటించారు. సముద్రఖని విలన్ రోల్ ను పోషించారు. థమన్ మ్యూజిక్ అందించగా.. జీఎంబీ ఎంటర్ టైనర్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ సంస్థలు నిర్మించాయి. మే 12న చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది.