భరత్ అనే నేను స్టోరీ రాసింది పవన్ కోసమేనట

Published : Mar 22, 2018, 12:45 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
భరత్ అనే నేను స్టోరీ రాసింది పవన్ కోసమేనట

సారాంశం

తన సినిమాలకు తానే కథ రాసుకునే కొరటాల శివ భరత్ అనే నేను విషయంలో మాత్రం రూ. 1 కోటిని శ్రీహరి నానుకు చెల్లించి మరీ కథ కొనుక్కున్నాడు​ ఈ స్టోరీని పవర్ స్టార్ కోసమే రాసుకున్నట్లు కొత్త విషయం చెబుతున్నాడు శ్రీహరి నాను​

 తన సినిమాలకు తానే కథ రాసుకునే కొరటాల శివ.. భరత్ అనే నేను విషయంలో మాత్రం రూ. 1 కోటిని శ్రీహరి నానుకు చెల్లించి మరీ కథ కొనుక్కున్నాడు. ఇందుకు కారణం.. ఈ సబ్జెక్ట్ పై ఉన్న నమ్మకమే. ఈ స్టోరీని పవర్ స్టార్ కోసమే రాసుకున్నట్లు కొత్త విషయం చెబుతున్నాడు శ్రీహరి నాను. 2014లో పవన్ కళ్యాణ్ జనసేన ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత వచ్చిన ఆలోచనతోనే ఈ కథ తయారు చేశాడట. అలాగే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందనే స్ఫూర్తితోనే ఈ స్టోరీని సిద్ధం చేశానని చెప్పాడు ఈ రైటర్. 

అంతే కాదు.. ఈ కథను పవన్ కు కూడా వినిపించగా.. తన ముఖ్యమంత్రి అయేందుకు పార్టీ పెడుతున్నాననే రాంగ్ సిగ్నల్స్ ను జనాలకు పంపుతుందని ఫీలయ్యాడట పవన్. అయితే స్టోరీ బాగుందని మాత్రం ప్రశంసించాడట. ఆ తర్వాతే కొరటాల రంగంలోకి దిగి.. ఈ కథకు తన స్టైల్ మెరుగులు అద్ది భరత్ అనే నేను చిత్రాన్ని సాకారం చేశాడు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్