
అలనాటి అందాల తార శ్రీదేవి తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. గతేడాది ఆమె ప్రమాదవశాత్తు మరణించారు. నేడు ఆమె ప్రధమ వర్ధంతి సందర్భంగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.
అది శ్రీదేవి చివరిసారిగా కనిపించిన వీడియో. శ్రీదేవి భర్త బోనీకపూర్ గతేడాది జూన్ 2న తమ పెళ్లి రోజునాడు శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ ట్విట్టర్ ద్వారా ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో దుబాయ్ లో జరిగిన పెళ్లి వేడుకలో శ్రీదేవి ఎంతో ఆనందంగా తన బంధువులతో కలిసి సరదాగా గడుపుతూ.. డాన్స్ లు చేస్తూ కనిపించింది.
ఈరోజు ఆమె వర్ధంతి కావడంతో ఆమె చివరిసారిగా కనిపించిన ఈ వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల బోనీకపూర్ కుటుంబం తొలి వర్ధంతి ప్రార్ధన కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఫిబ్రవరి 24న శ్రీదేవి చనిపోయినా.. తిథుల ప్రకారం ఆమె చనిపోయిన రోజు ఫిబ్రవరి 14న కావడంతో అదే రోజు చెన్నైలో శ్రీదేవి ఇంట్లో ప్రార్ధనలు ఏర్పాటు చేశారు.