జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్!

Published : Feb 24, 2019, 12:12 PM IST
జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్!

సారాంశం

అందాల తార శ్రీదేవి మరణించి నేటికి ఏడాది పూర్తవుతోంది. తన బంధువుల ఇంట్లో పెళ్లి కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి గతేడాది ఫబ్రవరి 24న బాత్ టబ్ లో మునిగి ప్రమాదవశాత్తు మరణించింది. 

అందాల తార శ్రీదేవి మరణించి నేటికి ఏడాది పూర్తవుతోంది. తన బంధువుల ఇంట్లో పెళ్లి కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి గతేడాది ఫబ్రవరి 24న బాత్ టబ్ లో మునిగి ప్రమాదవశాత్తు మరణించింది.

ఆమె మరణ వార్త కుటుంబ సభ్యులతో పాటు సినీలోకాన్ని కలచి వేసింది. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ తన తల్లితో ఉన్న అనుబంధాన్ని సందర్భం వచ్చిన ప్రతీసారి గుర్తు చేసుకుంటే ఉంది. నేడు శ్రీదేవి ప్రధమ వర్ధంతి సందర్భంగా జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

తన తల్లి చేయి పట్టుకొని ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. ''నా హృదయం ఎప్పుడూ భారంగానే ఉంటుంది. కానీ నేను నవ్వుతూనే ఉంటాను. ఎందుకంటే ఆ నువ్వులోనే నువ్వున్నావ్‌'' అంటూ పోస్ట్ పెట్టింది.

జాన్వీతో పాటు మరికొందరు సినీ ప్రముఖులు, అభిమానులు శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఎలాగైనా రీతూని సైడ్ చేయాలని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కుట్ర.. వీళ్ళ స్ట్రాటజీతో భరణి బలి
Akhanda 2 Premiers: అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు, తీవ్ర ఇబ్బందుల్లో నిర్మాతలు.. సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటి ?