ఆ లఫూట్ వెధవని నేనే.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!

Published : Feb 24, 2019, 10:47 AM IST
ఆ లఫూట్ వెధవని నేనే.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!

సారాంశం

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేశాడు. అందులో వర్మతో పాటు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, శ్రీదేవిలు ఉన్నారు. 

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేశాడు. అందులో వర్మతో పాటు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, శ్రీదేవిలు ఉన్నారు. ఈ ఫోటో షేర్ చేస్తూ వర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

90ల కాలంలో వర్మ టాలీవుడ్ అగ్ర హీరోలందరితో చాలా సన్నిహితంగా ఉండేవారట. ఆ సందర్భంలో తీసుకున్న ఫోటోని వర్మ షేర్ చేశాడు. అందరూ ఓ పార్టీలో పాల్గొన్నప్పుడు తీసిన ఫోటో అది.

చిరంజీవి, వెంకటేష్ తమ చేతుల్లో ఉన్న మందు గ్లాస్ లని కనిపించకుండా దాచేస్తే.. వర్మ, నాగార్జున మాత్రం క్లియర్ గా కనిపించేలా పట్టుకున్నారు.

ఈ విషయంపై వర్మ మాట్లాడుతూ.. 'చివరి లెఫ్ట్ లో ఉన్న మహా లఫూట్ వెధవని నేనే.. లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్స్ లో గ్లాస్ లు ఉన్నాయి. మధ్యలో ఉన్న వాళ్ల గ్యాండ్స్ లో ఉన్నవేవో దాస్తున్నారు. శ్రీదేవి గారు రెండు చేతులు ఫ్రీగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిజాయితీ నాలోనూ, శ్రీదేవిలోనూ, నాగార్జునలో మాత్రమే ఉంది కాబట్టి' అంటూ కామెంట్స్ చేశారు.
 

 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..