శ్రీదేవి మరణానికి కారణం అదే.. ఇన్నాళ్లు దాగున్న రహస్యాన్ని బయటపెట్టిన భర్త బోనీ కపూర్‌

Published : Oct 02, 2023, 10:27 PM IST
శ్రీదేవి మరణానికి కారణం అదే.. ఇన్నాళ్లు దాగున్న రహస్యాన్ని బయటపెట్టిన భర్త బోనీ కపూర్‌

సారాంశం

శ్రీదేవి మరణంపై ఇన్నాళ్లు స్పందించని నిర్మాత బోనీ కపూర్‌ మొదటి సారి స్పందించారు. శ్రీదేవి మరణానికి అసలు కారణం ఏంటో బయటపెట్టారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించడం విశేషం.

అతిలోక సుందరి శ్రీదేవి ఐదేళ్ల క్రితం హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. దుబాయ్‌లో ఆమె బాత్‌రూమ్‌లో చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. కానీ శ్రీదేవి మరణంపై అనేక అనుమానాలున్నాయి. ఆమె డెత్‌ ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అయితే చాలా వరకు భర్త బోనీ కపూర్‌ని అనుమానించారు. ఆమె మరణానికి ఆయనే కారణం అయ్యుంటాడనే ప్రచారం జరిగింది. 

ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు స్పందించని నిర్మాత బోనీ కపూర్‌ మొదటి సారి స్పందించారు. శ్రీదేవి మరణానికి అసలు కారణం ఏంటో బయటపెట్టారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించడం విశేషం. ఇందులో బోనీ కపూర్‌ చెబుతూ, శ్రీదేవిది సహజ మరణం కాదని, ప్రమాదవశాత్తు చోటుచేసుకున్న మరణం అని తెలిపారు. అయితే ఈ సందర్భంగా శ్రీదేవికి సంబంధించిన ఓ రహస్యాన్ని బయటపెట్టారు. 

అందంలో అతిలోక సుందరి శ్రీదేవిని మించి మరే కథానాయిక లేదంటారు. ఆమె అందానికి కోట్లాది మంది అభిమానులున్నారు. లేడీ సూపర్‌ స్టార్‌గా వెలిగిన ఆమె అందానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచారు. అయితే అంత అందంగా కనిపించడం కోసం ఆమె  కఠినమైన డైట్‌ని ఫాలో అయ్యేదట. పెళ్లి తర్వాత ఆ విషయం తనకు తెలిసిందని బోనీ కపూర్‌ తెలిపారు. ఆమె ఉప్పు లేకుండా భోజనం చేసేదట. దీని కారణంగా చాలాసార్లు ఆమె నీరసించిపోయేదని వెల్లడించారు. అంతేకాదు లో బీపీ సమస్య తలెత్తేదని, చాలా సార్లు ఆమె కళ్లు తిరిగినట్టు చేసేదని వెల్డించారు.

అయితే ఈ విషయంలో చాలా కేర్‌ తీసుకోవాలని డాక్టర్లు చెప్పినా తను సీరియస్‌గా తీసుకోలేదని, శ్రీదేవిది సహజ మరణం కాదని, ఆమె ప్రమాదవశాత్తు మరణించిందని చెప్పారు. దీంతో దుబాయిలో పోలీసులు తనని ఓ రోజంగా విచారించారని, లై డిటెక్టర్‌ టెస్ట్ కూడా చేశారని, భారత మీడియా నుంచి ఒత్తిడి కారణంగా తనని పోలీసులు అన్ని విధాలుగా పరీక్షించినట్టు చెప్పారు. శ్రీదేవి చనిపోయిన కొన్ని రోజులకు నాగార్జున ఓ సారి కలిశారని, డైట్‌ కారణంగా ఓ సారి సినిమా సెట్‌ లో కూడా శ్రీదేవి స్పృహ తప్పి పడిపోయినట్టు చెప్పాడని బోనీ కపూర్‌ తెలిపారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. 

ఆయన చెప్పినదాని ప్రకారం దుబాయ్‌లో హోటల్‌ బాత్రూమ్‌లో శ్రీదేవి కళ్లు తిరిగి కాలు జారి పడిపోయిందని తెలుస్తుంది. మరి ఇందులో నిజాలేంటనేది తెలియాలి. ఇక 2018 ఫిబ్రవరిలో ఫ్రెండ్‌ కుటుంబంలో పెళ్లికి హాజరయ్యేందుకు శ్రీదేవి, బోనీ కపూర్‌ తమ ఫ్యామిలీతో దుబాయి వెళ్లిన విషయం తెలిసిందే. అతిలోక సుందరి మరణంతో యావత్ సినీ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. సెకండ్‌ ఇన్నింగ్స్ లో నటిగా బిజీ అవుతున్న సమయంలోనే ఇలా జరగడంతో అభిమానులు కన్నీరు మున్నీరయ్యారు. శ్రీదేవి హిందీ, తెలుగుతోపాటు సౌత్‌ భాషలన్నింటిలోనూ నటించి మెప్పించింది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఎలాగైనా రీతూని సైడ్ చేయాలని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కుట్ర.. వీళ్ళ స్ట్రాటజీతో భరణి బలి
Akhanda 2 Premiers: అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు, తీవ్ర ఇబ్బందుల్లో నిర్మాతలు.. సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటి ?