17న మా అబ్బాయి గా వస్తున్న శ్రీవిష్ణు

Published : Mar 07, 2017, 10:35 AM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
17న మా అబ్బాయి గా వస్తున్న  శ్రీవిష్ణు

సారాంశం

శ్రీ విష్ణు హీరోగా రూపొందిన ''మా అబ్బాయి' ఈ నెల 17 న విడుదలకు సిద్దమవుతున్న మూవీ

ప్రేమ ఇష్క్ కాద‌ల్‌', 'ప్ర‌తినిధి', 'అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు' చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న శ్రీ విష్ణు హీరోగా రూపొందిన ''మా అబ్బాయి' చిత్రం ఈ నెల 17 న విడుదలకు సిద్దమవుతోంది. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బేబీ సాక్షి సమర్పణలో కుమార్ వట్టి దర్శకత్వంలో బలగ ప్రకాష్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు.

నిర్మాత బలగ ప్రకాష్ రావు మాట్లాడుతూ - "అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 17 న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. శ్రీవిష్ణు ఇమేజ్ ని మరింత పెంచే సినిమా అవుతుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ అంశాలన్నీ ఈ సినిమా లో పుష్కలంగా ఉన్నాయి. మా వెన్నెల క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాతో ఇండస్ట్రీలో నిలబడిపోతుందనే గట్టి నమ్మకం ఉంది. దర్శకుడు కుమార్ వట్టి కొత్తవాడైనా , అనుభవజ్ఞుడిలా   మంచి అవుట్ ఫుట్ ఇచ్చాడు. " అని చెప్పారు.

దర్శకుడు కుమార్ వట్టి మాట్లాడుతూ - "ఈ సినిమాలో లవ్, సెంటిమెంట్, కామెడీ, యాక్షన్.. ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి.శ్రీ విష్ణులోని మాస్ యాంగిల్ ని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది. ఇటీవల విడుదలైన పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది " అని తెలిపారు.

శ్రీవిష్ణు, చిత్ర శుక్ల జంటగా నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః థ‌మ‌శ్యామ్,సంగీతంః సురేష్ బొబ్బిలి, పాట‌లుః కందికొండ‌, క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల‌, సురేష్ బ‌నిశెట్టి,  ఎడిటింగ్ః మార్తాండ్.కె.వెంక‌టేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః వండాన రామ‌కృష్ణ‌, నిర్మాతః బ‌ల‌గ ప్ర‌కాష్ రావు,క‌థ‌,స్ర్కీన్ ప్లే,మాట‌లు,ద‌ర్శ‌క‌త్వం-కుమార్ వ‌ట్టి. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?