‘అర్జున ఫల్గుణ’టీజర్ రిలీజ్, స్టోరీ లైన్ ఇదే

Surya Prakash   | Asianet News
Published : Nov 09, 2021, 02:47 PM IST
‘అర్జున ఫల్గుణ’టీజర్ రిలీజ్, స్టోరీ లైన్ ఇదే

సారాంశం

శ్రీవిష్ణు   హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘అర్జున ఫల్గుణ’. ఈ చిత్రానికి తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ని చిత్ర టీమ్ సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేసింది. ఇందులో శ్రీవిష్ణు ఎన్టీఆర్‌కు వీరాభిమానిగా కనిపించనున్నారు

రీసెంట్ గా ‘రాజ రాజచోర’ చిత్రంతో మంచి హిట్ కొట్టిన  శ్రీవిష్ణు  తాజా చిత్రం  ‘అర్జున ఫల్గుణ’.ఘాజీ, క్షణం, వైల్డ్ డాగ్ లాంటి విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ వారి లేటెస్ట్ ఫిలిం ఇది.  తెలియని నేరంలో పీకలదాకా ఇరుక్కున్న శ్రీవిష్ణు ,అతని ఫ్రెండ్స్.. చివరికి దాన్నుంచి ఎలా బైటపడ్డారు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. ఇంట్రస్టింగ్ కథాకథనాలతో రూపొందిన ఈ టీజర్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. 

 ఇందులో శ్రీవిష్ణు ఎన్టీఆర్‌కు వీరాభిమానిగా కనిపించనున్నారు. క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీవిష్ణు నటన ఆకట్టుకునేలా ఉంది. ‘‘నాది కాని కురుక్షేత్రంలో నాకు తెలియని పద్మవ్యూహంలో ఇరుక్కుపోయాను. అయినా బలైపోవడానికి నేను అభిమన్యుడ్ని కాదు.. అర్జునుడ్ని’’ అంటూ శ్రీవిష్ణు చెప్పిన సంభాషణలు మెప్పించేలా ఉన్నాయి.
 Also read Naatu Naatu song promo: వీర నాటు ఊర నాటు... అంచనాలు పెంచేసిన ఆర్ ఆర్ ఆర్ సాంగ్ ప్రోమో
ఇంటెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా  షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ లో శ్రీవిష్ణు ఒక ప్రత్యేక మిషన్‌లో డాషింగ్ మ్యాన్‌గా కనిపిస్తున్నాడు. శ్రీవిష్ణు స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్స్ చాలా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. 

Also read Bigg boss telugu 5: ఆ కారణంగా హౌస్ నుండి జస్వంత్ అవుట్... కుప్పకూలిపోయిన సిరి, షన్ను!

 తేజా మార్ని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నరేశ్, శివాజీరాజా, సుబ్బరాజు, దేవీప్రసాద్, జబర్దస్త్ మహేశ్, రాజ్ కుమార్ చౌదరి, చైతన్య ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Day 50 Collection: `బార్డర్ 2` దెబ్బకు ధురంధర్ ఆట క్లోజ్, 50 రోజుల కలెక్షన్లు
Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే