bigg boss telugu 6 elimination: మిడ్‌వీక్‌ ఎలిమినేషన్‌.. శ్రీ సత్య ఔట్‌.. హౌజ్‌మేట్స్ ని బకరా చేసిన బిగ్ బాస్‌

Published : Dec 16, 2022, 11:38 PM IST
bigg boss telugu 6 elimination: మిడ్‌వీక్‌ ఎలిమినేషన్‌.. శ్రీ సత్య ఔట్‌.. హౌజ్‌మేట్స్ ని బకరా చేసిన బిగ్ బాస్‌

సారాంశం

అత్యధికంగా మూడు ఓట్లతో కీర్తి బయటకు వెళ్లేందుకు నిలిచింది. హౌజ్‌ మేట్స్ అభిప్రాయం ప్రకారం కీర్తి బయటకు వెళ్లాలి. కానీ ఇక్కడే ట్విస్ట్ పెట్టారు బిగ్‌ బాస్‌. 

బిగ్‌ బాస్‌ 6 తెలుగు విన్నర్‌ ఎవరో తెలియడానికి రెండు రోజులే ఉన్నాయి. విన్నర్‌ ఎవరనేదానిపై నెటిజన్లు, ఆడియెన్స్ లెక్కలేసుకోవడం ప్రారంభించారు. ఈక్రమంలో హైజ్‌లో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌ బాస్‌. మిడ్‌ వీక్‌ ఎవిక్షన్‌ పేరుతో ఒకరిని ఎలిమినేట్‌ చేశారు. ఈ మిడ్‌ వీక్ ఎవిక్షన్‌లో భాగంగా శ్రీ సత్యని ఎలిమినేట్‌ చేయడం గమనార్హం. మొదట్నుంచి శ్రీసత్య పేరు వినిపిస్తూ వస్తోంది. అందులో భాగంగానే ఆమెని శుక్రవారం ఎపిసోడ్‌లో హౌజ్‌ నుంచి బయటకు పంపించేశాడు బిగ్‌ బాస్‌. ఈ ప్రాసెస్‌లో హౌజ్‌మేట్స్ ని బకరా చేయడం గమనార్హం. 

ఎలిమినేషన్‌కి ముందు హౌజ్‌ మేట్స్ కి ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్‌. టైటిల్‌ విన్నర్‌ పోటీకి గానూ టాప్‌ 5లో ఉండేందుకు అర్హత లేని సభ్యులెవరో తెలియజేయాలని వెల్లడించారు. హౌజ్‌మేట్స్ అంతా తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఇందులో రోహిత్‌ పేరుని శ్రీహాన్‌ చెప్పగా, ఆదిరెడ్డి పేరుని కీర్తి చెప్పింది. కీర్తి పేరుని శ్రీ సత్య, శ్రీహాన్‌ పేరుని రోహిత్‌, కీర్తి పేరుని మళ్లీ రేవంత్‌, ఆదిరెడ్డి చెప్పారు. అత్యధికంగా మూడు ఓట్లతో కీర్తి బయటకు వెళ్లేందుకు నిలిచింది. హౌజ్‌ మేట్స్ అభిప్రాయం ప్రకారం కీర్తి బయటకు వెళ్లాలి. 

కానీ ఇక్కడే ట్విస్ట్ పెట్టారు బిగ్‌ బాస్‌. ఇది కేవలం హౌజ్‌మేట్స్ అభిప్రాయం మాత్రమే అని వెల్లడించారు. ఆడియెన్స్ నిర్ణయించిందే ఫైనల్‌ అని తెలిపారు. ఆ రకంగా కొంత సస్పెన్స్ క్రియేట్‌ చేసి ఆడియెన్స్ ఓటింగ్ ప్రకారం టాప్‌ 5కి అర్హులు ఎవరు కారో నిర్ణయించారు. అతి తక్కువ ఓట్లు వచ్చిన వారిలో శ్రీసత్య నిలవడంతో ఆమెని గ్రాండ్‌ ఫైనల్‌కి రెండు రోజుల ముందు ఎలిమినేట్‌ చేయడం విశేషం. ఆమెకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండానే ఎలిమినేట్‌ చేశాడు బిగ్‌ బాస్‌. గ్రాండ్‌ ఫినాలే రోజు ఆమె చేత మాట్లాడించే అవకాశం ఉంది.

ఇక శుక్రవారం ఎపిసోడ్‌ లో మొదట హౌజ్‌మేట్స్ మధ్య చిన్న పాటి వాగ్వాదాలు, ఒకరిపై ఒకరు కామెంట్ చేసుకోవడం జరిగాయి. అనంతరం ఇద్దరు సభ్యులు శ్రీహాన్‌, కీర్తిలకు డైరెక్ట్ గా ఆడియెన్స్ తో మాట్లాడి, తనకు ఓటు వేయాలని రిక్వెస్ట్ చేసుకునే అవకాశం కల్పించాడు బిగ్‌ బాస్‌. ఇందులో శ్రీహాన్‌, కీర్తిల మధ్య ఓ టాస్క్ పెట్టగా, శ్రీహాన్‌ విన్నర్‌ గా నిలిచి ఆడియెన్స్ తో ఓటు కోసం మాట్లాడారు. తాను కొన్ని తప్పులు చేశానని, వాటిని సరిదిద్దుకున్నానని, తప్పులకు క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు శ్రీహాన్‌. తాను విన్నర్‌గా నిలవాలనుకుంటున్నానని, అందుకు ఓట్లు వేసి గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా తమని కాపాడుతున్న జవాన్లకి, అన్నపెట్టే రైతులకు, పేరెంట్స్ కి పాదాభివందనం చేశారు శ్రీహాన్‌. 

మరోవైపు కీర్తి మరో టాస్క్ లో విన్నర్‌ అయ్యారు. ఆమె కీర్తి హౌజ్‌లో ఎలా ఉంటుందో బయట కూడా అలానే ఉంటుందని, ఇదే కీర్తి అని చెప్పింది. ఈ బిగ్‌ బాస్‌ షో ద్వారా గెలిచే డబ్బుల తన సొంతానికి వాడుకోనని, సోషల్‌ వర్క్ కోసం వాడుతానని, తనలాంటి వారికి హెల్ప్ చేస్తానని తెలిపింది. మరి ఆడియెన్స్ ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తారు, ఎవరిని గెలిపిస్తారనేది వేచి చూడాలి. ప్రస్తుతం హౌజ్‌లో రేవంత్‌, శ్రీహాన్‌, కీర్తి, ఆదిరెడ్డి, రోహిత్‌ ఉన్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు
Annagaru Vostaru:అన్నగారు వస్తారా ? రారా ? బాలకృష్ణ తర్వాత కార్తీ సినిమాకు చుక్కలు చూపిస్తున్న హైకోర్టు