నాగార్జున సంచలన నిర్ణయం.. బిగ్‌ బాస్‌ షోకి గుడ్‌ బై.. నెక్ట్స్ హోస్ట్ అతనేనా?

Published : Dec 16, 2022, 11:00 PM ISTUpdated : Dec 16, 2022, 11:42 PM IST
నాగార్జున సంచలన నిర్ణయం.. బిగ్‌ బాస్‌ షోకి గుడ్‌ బై.. నెక్ట్స్ హోస్ట్ అతనేనా?

సారాంశం

బిగ్‌ బాస్‌ మూడో సీజన్‌ నుంచి నాగార్జున హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. మూడు, నాలుగు, ఐదు, ఓటీటీ, ఆరో సీజన్‌ లకు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

బిగ్‌ బాస్‌ రియాలిటీ షో ప్రస్తుతం ఆరో సీజన్‌ రన్‌ అవుతుంది. ఇది ఈ వారంతో పూర్తి కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ షోకి సంబంధించిన ఓ బ్రేకింగ్ న్యూస్‌ వైరల్‌ అవుతుంది. ఈ షోకి హోస్ట్ నాగార్జున గుడ్‌ బై చెప్పబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ అన్‌ ఫెయిర్‌ ఎలిమినేషన్‌, దీనికితోడు మరికొన్ని అన్‌ ఫెయిర్‌ నిర్ణయాల విషయంలో అసంతృప్తిగా ఉన్నారట నాగ్. మరోవైపు షో పై కూడా నెటిజన్లు, ఆడియెన్స్ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాగ్‌ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారని సమాచారం. 

గత వారం బలమైన కంటెస్టెంట్‌ ఇనయని ఊహించని విధంగా ఎలిమినేట్‌ చేశారు. టాప్‌ 5లో ఉండాల్సిన ఆమెని ఎలిమినేట్ చేయడంతో ఆడియెన్స్ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. కొంత ట్రోల్స్ కి కారణమైంది. నాగ్‌ సైతం దీనిపై సీరియస్ అయ్యాడట. అంతేకాదు షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. తాను బిగ్ బాస్‌కి గుడ్‌ బై చెప్పాలనుకుంటున్నారట. అయితే తాను గుడ్‌ బై చెప్పాలనుకునేది నెక్ట్స్ సీజన్‌కి అని టాక్‌. ఈ సీజన్‌ ఎండింగ్‌ వరకు కొనసాగి, ఇకపై బిగ్‌ బాస్‌ నుంచి తప్పుకోవాలనుకుంటున్నారట. 

బిగ్‌ బాస్‌ మూడో సీజన్‌ నుంచి నాగార్జున హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. మూడు, నాలుగు, ఐదు, ఓటీటీ, ఆరో సీజన్‌ లకు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మొదటి షోకి ఎన్టీఆర్, రెండో షోకి నాని హోస్ట్ గా చేశారు. మూడు నుంచి నాగార్జున హోస్ట్ గా చేస్తూ వస్తున్నారు. అయితే గత సీజన్‌తో పోల్చితే ఈ సీజన్‌ రేటింగ్ పడిపోయిందనే కామెంట్లు వచ్చాయి. కంటెస్టెంట్లు, వారి ఆట తీరుపై కూడా విమర్శలు వచ్చాయి. హోస్ట్ గా నాగ్‌ కూడా ఏం చేయలేకపోతున్నారనే కామెంట్లూ వచ్చాయి. రాను రాను షో రేటింగ్‌ పడిపోతున్న నేపథ్యంలో నాగ్‌ నిర్ణయం ఆసక్తిని రేకెత్తిస్తుంది. 

ఇదిలా ఉంటే నాగ్‌ స్థానంలో వచ్చే సీజన్‌కి విజయ్‌ దేవరకొండ హోస్ట్ గా చేస్తారని సమాచారం. బిగ్‌ బాస్‌ సీజన్‌ 7కి విజయ్‌ దేవరకొండ హోస్ట్ చేయబోతున్నారని సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక బిగ్‌ బాస్‌ తెలుగు 6 ముగింపుకి ఇంకా రెండు రోజులే ఉన్నాయి. శుక్రవారం ఎపిసోడ్‌లో మిడ్‌ వీక్‌ ఎవిక్షన్‌ పేరుతో శ్రీ సత్యని తొలగించారు. ఆదివారం ఎపిసోడ్‌తో షో పూర్తి కాబోతుంది. ప్రస్తుతం హౌజ్‌లో రేవంత్‌, శ్రీహాన్‌, ఆదిరెడ్డి, రోహిత్‌, కీర్తి ఉన్నారు. టాప్‌ 5 కంటెస్టెంట్‌గా నిలిచారు. వీరిలో టైటిల్‌ విన్నర్‌ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. రేవంత్‌ టైటిల్‌ విన్నర్‌ అవుతారనే ప్రచారం జరుగుతుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఎలాగైనా రీతూని సైడ్ చేయాలని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కుట్ర.. వీళ్ళ స్ట్రాటజీతో భరణి బలి
Akhanda 2 Premiers: అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు, తీవ్ర ఇబ్బందుల్లో నిర్మాతలు.. సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటి ?