
యంగ్ హీరోహీరోయిన్ నిఖిల్ (Nikhil) - అనుపమా పరమేశ్వరన్ (Anupama) జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ‘18 పేజెస్’. వరుస హిట్ సినిమాలను అందిస్తూ ‘జీఏ 2’ పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇటీవలే ‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా హిట్ అందుకున్న నిఖిల్ - అనుపమ ‘18పేజెస్’తో అలరించబోతున్నారు. చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథ అందించగా.. సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహిస్తున్నారు.
రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తున్నారు. రిలీజ్ కు ఇంకా ఏడు రోజులే సమయం ఉండటంతో సినిమాను మరింత జోరుగా ప్రమోట్ చేస్తుకున్నారు. తాజాగా ‘18 పేజేస్’ సెన్సార్ ను పూర్తి చేసుకుంది. జీరో కట్స్ తో యూ/ఏ సర్టిఫికెట్ ను పొందింది. ఇదే విషయాన్ని మేకర్స్ సరికొత్త పోస్టర్ ను విడుదల చేస్తూ ప్రకటించారు. దీంతో క్రిస్టమస్ కు పర్ఫెక్ట్ ఫ్యామిలీ పిక్చర్ గా ‘18 పేజెస్’ నిలుస్తుందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. డిసెంబర్ 19న నిర్వహించే ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)ను ఆహ్వానించినట్టు కొద్దిసేపటి క్రితమే అనౌన్స్ చేశారు. హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో 19న సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిఖిల్ - అనుపమాతో పాటు చిత్ర యూనిట్ కు బన్నీ ఆల్ ది బెస్ట్ చెప్పేందుకు రాబోతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇప్పటికే చిత్రం నుంచి అందుతున్న క్రేజీ అప్డేట్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. పోస్టర్లు, పాటలు, టీజర్ కు అదిరిపోయే స్పందన లభించింది. ఈ తరుణంలో ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ను రేపు (డిసెంబర్ 17)న రిలీజ్ చేయబోతుండటం విశేషం. ఇక ట్రైలర్ తో సినిమాపై మరింత ఆసక్తిని పెంచేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 23న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.