పవన్ కి ఆ రోగముందంటున్న శ్రీరెడ్డి

First Published Apr 24, 2018, 3:59 PM IST
Highlights

పవన్ కి ఆ రోగముందంటున్న శ్రీరెడ్డి

జనసేన అధ్యక్షుడు - సినీ నటుడు పవన్ కల్యాణ్ పై మెగా ఫ్యామిలీపై నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. తన ఫ్యాన్స్ కు పవన్ నచ్చజెప్పుకోవాలని - క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా తనపై ట్రోలింగ్ ఆపడం లేదని శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది.తనపై వస్తోన్న విమర్శలకు ఘాటుగా బదులిస్తోన్న నటి శ్రీరెడ్డి మరో బాణం విసిరారు. ఇప్పటివరకు ఆయా వ్యక్తుల పేర్లు వెల్లడిస్తూ ఎదురుదాడి చేసిన ఆమె.. ఇప్పుడు ఏ ఒక్కరి పేరునూ ప్రస్తావించకుండా చేసిన పోస్ట్‌ వైరల్ అయింది. ‘ఇది ఖచ్చితంగా పారానాయిడ్‌ పర్సనాలిటీ డిజార్డర్‌(పీపీడీ) అనే మానసిక వ్యాధి’ అని, ‘ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ముందు వ్యాధిగ్రస్తుడినని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంద’ని ఆమె వ్యాఖ్యానించారు. అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ప్రకారం ఆ మానసిక వ్యాధి లక్షణాలివి అంటూ ఆరు పాయింట్లు రాసుకొచ్చారు.
ఖఛ్చితంగా PPD (Paranoid personality disorder) అనబడే ఒక మానసిక వ్యాధి కి సంబంధించిన రోగ గ్రస్తుడు

అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ప్రకారం ఆ మానసిక వ్యాధి లక్షణాలివి.
1)ఆధారాలేమి లేకుండా అనుమానాలు అపనమ్మకాలలో మునిగిపోవడం
2)అనూన్యతా భావం తో చిన్న చిన్న విషయాలకి కూడా భరించలేని అవమానం ఫీల్ అవ్వడం
3)తాను నమ్మే వాటి నిర్ధారణ కోసం తన కళ్ళకి మాత్రమే కనిపించే క్లూ లని ఊహించుకోవడం
4) లేని శత్రువుల నుంచి తనకేదో వాళ్ళనుంచి ప్రమాదం ఉందనుకునే భ్రమలో కూరుకుపోయి లేదని ప్రూవ్ చేసినా అర్ధమయ్యే శక్తి కోల్పోవడం
5) మీనింగ్ ఫుల్ భావోద్వేగాల్ని కోల్పోవడం వల్ల Schizoidisolation అనబడే ఒంటరి తనం కోరుకునే ఇంకొక మెంటల్ ప్రాబ్లెమ్ కి లోనవడం
6) అకారణంగా పగల్ని ప్రతీకారాల్ని పెంచుకుని ఎవరేం చేసినా తనని తొలిగించటానికే ప్లాన్ చేస్తున్నారని అనుకోవడం
ఈ పాయింట్లని స్టడీ చేసి,చేష్టల్ని కానీ,ట్వీట్లని కానీ పరిశీలిస్తే ఈ 6 పాయింట్లు కూడా మ్యాచ్ అవుతాయి.
ఈ వ్యాధి ఉన్న మెంటల్ పేషెంట్లకు ట్రీట్మెంట్ చెయ్యకపోతే ముందు ముందు Schizotypal మరియు Schizoid అనబడే ఇంకో రెండు మెంటల్ వ్యాధులు కూడా రావటానికి అవకాశముంది.
కానీ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ముందు వ్యాధిగ్రస్థుడినని ఒప్పుకోవాల్సిన అవసరముంది. అంటూ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది

click me!