వెండి తెరపై సందడి చేయనున్న దేవాన్ష్..?

First Published 24, Apr 2018, 12:19 PM IST
Highlights

సిల్వర్ స్క్రీన్ పై నారా, నందమూరి వారసుడు

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, హీరో బాలకృష్ణల ముద్దుల మనవడు వెండి తెరపై సందడి చేయడానికి సిద్ధమౌతున్నాడా..? అవుననే సమాధానమే వినపడుతోంది. ఆంధ్రుల అభిమాన నటుడు సీనియర్ ఎన్టీఆర్ జీవిత కథ ఆదారంగా బాలకృష్ణ ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ సినిమాలో బాలయ్య టైటిల్‌ రోల్‌లో కనిపించనున్నారు. ఇతర పాత్రలకు కూడా నందమూరి హీరోలనే తీసుకునే ఆలోచనలో ఉన్నాడు బాలకృష్ణ. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

ఎన్టీఆర్‌ చిన్నతనానికి సంబంధించిన సన్నివేశాల్లో బాల ఎన్టీఆర్‌గా నారా లోకేష్‌, బ్రాహ్మణీల కుమారుడు దేవాన్ష్‌ నటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు మరికొన్ని సన్నివేశాల్లో ఎన్టీఆర్‌గా కళ్యాణ్ రామ్‌ తనయుడు శౌర్యారామ్‌, నందమూరి హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్‌ నటించనున్నారు.

ఇక యంగ్ ఎన్టీఆర్‌గా బాలయ్య తనయుడు మోక్షజ్ఞను తీసుకోవాలని భావించినా బాలకృష్ణ వద్దన్నారని తెలుస్తోంది. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో 
యువ కథానాయకుడు శర్వానంద్‌ మరోకీలక పాత్రలో నటిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

Last Updated 24, Apr 2018, 12:19 PM IST