'అరే పవన్..' బూతులతో విరుచుకుపడ్డ శ్రీరెడ్డి!

Published : Apr 09, 2019, 10:11 AM ISTUpdated : Apr 09, 2019, 10:13 AM IST
'అరే పవన్..' బూతులతో విరుచుకుపడ్డ శ్రీరెడ్డి!

సారాంశం

నటి శ్రీరెడ్డి మరోసారి పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడింది. చాలా కాలంగా పవన్ ని టార్గెట్ చేస్తూ వస్తోన్న శ్రీరెడ్డి ఎన్నికల నేపధ్యంలో మరిన్ని విమర్శలు చేస్తోంది. 

నటి శ్రీరెడ్డి మరోసారి పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడింది. చాలా కాలంగా పవన్ ని టార్గెట్ చేస్తూ వస్తోన్న శ్రీరెడ్డి ఎన్నికల నేపధ్యంలో మరిన్ని విమర్శలు చేస్తోంది. సోమవారం నాడు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్.. నటుడు అలీపై సంచనల కామెంట్స్ చేశారు.

అలీ తనకు స్నేహితుడైనా.. జగన్ తో చేతులో కలిపి  తనను మోసం చేశాడని అన్నారు. అలీ చెప్పిన వాళ్లకు జనసేన తరఫున టికెట్ ఇచ్చినా.. తనను వదిలి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. అలీ కష్టాల్లో ఉన్నప్పుడు తను అండగా ఉన్నానని.. కానీ ఇప్పుడు అతడు వైసీపీలోకి వెళ్లిపోయారని పవన్ అన్నారు.

ఈ విషయంపై స్పందించిన అలీ.. పవన్ కి కౌంటర్ గా ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'మీరు ఏ విధంగా సాయపడ్డారు పవన్ సర్..' అంటూ పవన్ ని ప్రశ్నించాడు. మరోపక్క శ్రీరెడ్డి కూడా పవన్ పై విరుచుకుపడింది.

గొప్ప వ్యక్తిత్వమున్న అలీ గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది అంటూ మండిపడింది. 'అరే పవన్.. నీ స్థాయి ఏంటి..?' అంటూ బూతు పదాలు వాడింది. ఈ పోస్ట్ చూసిన పవన్ అభిమానులు శ్రీరెడ్డిని తిడుతూ కామెంట్స్ పెడుతున్నారు. 

ఏం చేశారు, సార్!: పవన్ కల్యాణ్ ను నిలదీసిన అలీ

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు మిత్రుడు అలీ కౌంటర్

స్నేహమంటే ఇదేనా: అలీపై మండిపడ్డ పవన్

PREV
click me!

Recommended Stories

NTR: షారూఖ్‌ ఖాన్‌తో ఎన్టీఆర్‌ భారీ మల్టీస్టారర్‌.. `వార్‌ 2`తో దెబ్బ పడ్డా తగ్గని యంగ్‌ టైగర్‌
జబర్దస్త్ లో సాధారణ కమెడియన్.. ప్రభాస్ కు క్లోజ్ ఫ్రెండ్ అని మీకు తెలుసా?