ఫొటో: మహేష్,ఎన్టీఆర్ ఫ్యామిలీలు కలిసి నిన్న రాత్రి...

Published : Apr 09, 2019, 09:50 AM IST
ఫొటో: మహేష్,ఎన్టీఆర్ ఫ్యామిలీలు కలిసి నిన్న రాత్రి...

సారాంశం

ఇప్పుడున్న టాప్ హీరోలు ఒకరితో మరొకరు మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. అంతకాదు రెగ్యులర్ ఫ్యామిలీలతో ఒకరినొకరు కలుస్తున్నారు.

ఇప్పుడున్న టాప్ హీరోలు ఒకరితో మరొకరు మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. అంతకాదు రెగ్యులర్ ఫ్యామిలీలతో ఒకరినొకరు కలుస్తున్నారు. వారి మధ్య పొరపొచ్చాలు లేవు. వృత్తిపరమైన జెలసీలు లేవు. టాలీవుడ్  లో ఇది చాలా మంది ట్రెండ్. రామ్ చరణ్ ,ఎన్టీఆర్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఇలాగే మహేష్,ఎన్టీఆర్ ల మధ్యకూడా అంతకు మించిన అనుబంధం ఉంది. ఎన్టీఆర్ అందరితో చక్కగా కలిసిపోతారు.ఆప్యాయంగా మెలుగుతారు. అదే అందరికి ఇష్టమవుతోంది. మహేష్ కూడా ఎంత బిజిలో ఉన్నా రిలేషన్స్ ని, ఫ్రెండ్షిప్ ని మర్చిపోరు. అందుకు ఈ ఫొటోనే ఉదాహరణ.

 

నిన్న రాత్రి ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి భార్య  మాలిని తన పుట్టిన రోజుని ఇదిగో ఇద్దరి స్టార్స్ మధ్యన జరుపుకుంది. వంశీ పైడిపల్లి గతంలో ఎన్టీఆర్ తో బృందావనం అనే హిట్ ఇచ్చారు. మహేష్ తో ఇప్పుడు మహర్షి చిత్రం చేస్తున్నారు. ఎన్టీఆర్, మహేష్ ఇద్దరూ తమ కుటుంబాలతో వచ్చి ఈ పార్టీలో పాల్గొనటంతో ఓ పండగ వాతావరణం ఏర్పడింది.  నమ్రత ఈ ఫొటోని తన ఇనిస్ట్రగ్రమ్ ఎక్కౌంట్ ద్వారా షేర్ చేసి అభిమానులకు ఆనందం కలగచేసారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తన ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ నుంచి కొద్ది రోజులు పాటు బ్రేక్ లో ఉన్నారు. మహేష్ తన తాజా చిత్రం మహర్షి రిలీజ్ దాకా రోజూ ఏదో ఒక హడావిడి ఉండనే ఉంటుంది. 

PREV
click me!

Recommended Stories

సుజీత్ కి పవన్ కారు గిఫ్ట్ గా ఎందుకు ఇచ్చారో తెలుసా ? అంత పెద్ద త్యాగం చేశాడా, హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
The Raja Saab: ప్రభాస్ రాజాసాబ్ సాంగ్ పై విపరీతంగా ట్రోలింగ్.. వర్షం, డార్లింగ్ సినిమాలు వైరల్