బిగ్ బాస్: హౌస్ మేట్స్ తో వాగ్వాదం.. హౌస్ నుండి వెళ్లిపోతా అంటూ బెదిరింపులు!

Published : Sep 18, 2018, 02:16 PM ISTUpdated : Sep 19, 2018, 09:29 AM IST
బిగ్ బాస్: హౌస్ మేట్స్ తో వాగ్వాదం.. హౌస్ నుండి వెళ్లిపోతా అంటూ బెదిరింపులు!

సారాంశం

బిగ్ బాస్ హిందీలో సీజన్ 12 మొదలైన సంగతి తెలిసిందే. ఈ షో మొదలై రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే హౌస్ లో వివాదం చోటు చేసుకుంది. హౌస్ మేట్స్ అందరూ కంటెస్టెంట్ శ్రీశాంత్ పై మండిపడటంతో ఆయన హౌస్ నుండి వెళ్లిపోతా అంటూ బెదిరిస్తున్నాడు. 

అసలు విషయంలోకి వస్తే.. బిగ్ బాస్ గేమ్ లో భాగంగా శ్రీశాంత్ కి ఒక టాస్క్ ఇచ్చారు. అయితే దానిపై ఆసక్తి చూపని అతడు టాస్క్ పూర్తి చేయడానికి నిరాకరించాడు. హౌస్ మేట్స్ ఎంతగా చెప్పినా.. బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చినా శ్రీశాంత్ మాత్రం టాస్క్ పూర్తి చేయలేదు. దీంతో బిగ్ బాస్ ఆ టాస్క్ ని రద్దు చేశాడు.

దీంతో హౌస్ మేట్స్ అందరూ కూడా శ్రీశాంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు . అతనితో గొడవకి దిగారు. దీంతో అలిగిన శ్రీశాంత్ ఇలా అయితే హౌస్ నుండి వెళ్లిపోతా అంటూ బెదిరించాడు.

గేమ్ లో ఇలాంటి టాస్క్ లే ఉంటాయంటే మాత్రం తను ఎక్కువ రోజులు ఈ గేమ్ లో కంటిన్యూ అవ్వలేనని అన్నాడు. విన్నర్ గా గెలిచి వస్తానని చెప్పిన అతడు ఇప్పుడు రెండో రోజుకే వెళ్లిపోతానని అనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరి ఈ వివాదంపై హోస్ట్ సల్మాన్ ఎలా స్పందిస్తాడో చూడాలి!

PREV
click me!

Recommended Stories

విజయ్ - రష్మిక ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? సీక్రెట్ చెప్పిన విజయ్ దేవరకొండ
ఇండస్ట్రీ హిట్ సినిమాని తన భార్యకి రాసిచ్చిన చిరంజీవి.. కమెడియన్ కి సాయం చేయబోయి నిందలు పడ్డ మెగాస్టార్