నటుడి అనుమానాస్పద మృతి!

Published : Sep 18, 2018, 01:59 PM ISTUpdated : Sep 19, 2018, 09:29 AM IST
నటుడి అనుమానాస్పద మృతి!

సారాంశం

జూనియర్ ఆర్టిస్ట్ అర్జున్ గౌడ్(30) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లో మంగా టిఫిన్ సెంటర్ ఎదురుగా హృదయ లాడ్జిలో గత ఇరవై రోజులుగా ఉంటోన్న అర్జున్ గౌడ్ జూనియర్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నాడు. 

ఆదివారం అర్ధరాత్రి షూటింగ్ ముగించుకొని వచ్చిన అతడు కొన్ని టాబ్లెట్లు వేసుకొని పడుకున్నాడు. అతడితో పాటు లాడ్జిలో ఉన్న తన స్నేహితుడు నాగకార్తిక్ టాబ్లెట్లు ఎందుకు వేసుకుంటున్నావని ప్రశ్నించగా.. దగ్గు వస్తుందని చెప్పి టాబ్లెట్లు వేసుకొని పడుకున్న అర్జున్ గౌడ్ తెల్లవారుజామున ఎంత సమయమవుతున్నా నిద్ర లేకపోవడంతో నాగకార్తిక్ అతడిని నిద్రలేపే ప్రయత్నం చేశాడు.

కానీ అతడు చలనం లేకుండా ఉండడంతో వెంటనే ఆంబులెన్స్ కి ఫోన్ చేసి సమాచారం అందించాడు. అతడు చనిపోయినట్లు నిర్ధారించడంతో నాగకార్తిక్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు టాబ్లెట్లు వేసుకోవడం వలన మరణించాడా..? లేక అనారోగ్యంతో మరణించాడా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9 Telugu: షాకింగ్ ట్విస్ట్... ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ విన్నర్ రేసులోకి..
Bigg Boss వల్ల చాలా నష్టపోయాను, అవకాశాలు కోల్పోయాను, టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్