ప్రణయ్ కోసం సినిమా పాట!

Published : Sep 18, 2018, 01:05 PM ISTUpdated : Sep 19, 2018, 09:29 AM IST
ప్రణయ్ కోసం సినిమా పాట!

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలోకి మిర్యాలగూడ ప్రాంతంలో జరిగిన పరువు హత్య రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రణయ్ అనే యువకుడిని ప్రేమించిన అమృత పెద్దలను ఎదిరించి అతడిని పెళ్లి చేసుకుంది.

తెలంగాణ రాష్ట్రంలోకి మిర్యాలగూడ ప్రాంతంలో జరిగిన పరువు హత్య రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రణయ్ అనే యువకుడిని ప్రేమించిన అమృత పెద్దలను ఎదిరించి అతడిని పెళ్లి చేసుకుంది.

ప్రణయ్ దళితుడు కావడంతో అతడిని అల్లుడిగా స్వీకరించలేని అమృత తండ్రి ప్రణయ్ ని హత్య చేయించారు. గత రెండు, మూడు రోజులుగా ఎక్కడ చూసిన ఇదే చర్చ. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన ఈ వివాదంపై సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు.  ఇది ఇలా ఉండగా తాజాగా ప్రణయ్ కోసం ఓ పాటను అంకితం చేసింది 'వీర భోగ వసంతరాయలు' సినిమా టీమ్.

ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాటను ఈ నెల 21న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన చిత్రబృందం ప్రేమకోసం బలైన వారికి ఈ పాటను అంకితమిస్తున్నామని, తాజాగా జరిగిన ఉదంతంలో ప్రాణాలు కోల్పోయిన ప్రణయ్ కి ఈ పాట అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్ బాబులు హీరోలుగా కనిపించనున్నారు. మరో ముఖ్య పాత్రలో హీరోయిన్ శ్రియ కనిపించనుంది. 

PREV
click me!

Recommended Stories

Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్
Bigg Boss Telugu 9 Elimination: బిగ్‌ బాస్‌ ఎలిమినేషన్‌లో బిగ్‌ ట్విస్ట్.. 13 వారం ఈ కంటెస్టెంట్ ఔట్‌