ఈసారి స్పోర్ట్స్ డ్రామా... వర్కవుట్ అవుతుందా అఖిల్..?

Published : Jan 30, 2019, 11:00 AM IST
ఈసారి స్పోర్ట్స్ డ్రామా... వర్కవుట్ అవుతుందా అఖిల్..?

సారాంశం

హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఏ వారసుడికి వరుసగా మూడు ఫ్లాప్ లు వచ్చి ఉండవు. కానీ అఖిల్ మాత్రం ఫ్లాపుల్లో హ్యాట్రిక్ అందుకున్నాడు. హీరోకి కావాల్సిన అన్ని లక్షణాలు అఖిల్ లో ఉన్నాయి. డాన్స్, ఫైట్స్ అన్నీ బాగా చేయగలడు. నటన విషయంలో కాస్త పరిణితి చెందాల్సివుంది.

హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఏ వారసుడికి వరుసగా మూడు ఫ్లాప్ లు వచ్చి ఉండవు. కానీ అఖిల్ మాత్రం ఫ్లాపుల్లో హ్యాట్రిక్ అందుకున్నాడు. హీరోకి కావాల్సిన అన్ని లక్షణాలు అఖిల్ లో ఉన్నాయి. డాన్స్, ఫైట్స్ అన్నీ బాగా చేయగలడు. 

నటన విషయంలో కాస్త పరిణితి చెందాల్సివుంది. 'మిస్టర్ మజ్ను' సినిమాపై అఖిల్ చాలా ఆశలే పెట్టుకున్నాడు కానీ ఈ సినిమా ఊహించని విధంగా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు తన తదుపరి సినిమా విషయంలో డైలమాలో పడ్డాడు అఖిల్. 'మిస్టర్ మజ్ను' సినిమాకు హిట్ టాక్ వచ్చి ఉంటే తన తదుపరి సినిమాను సంతోషంగా అనౌన్స్ చేసేవాడు అఖిల్.

కానీ ఈ సినిమా బోల్తా కొట్టడంతో ఆలోచనలో పడిపోయాడు. స్పోర్ట్స్ డ్రామాతో సినిమా చేయాలని అనుకున్నాడు. దీనికి సంబంధించి కథ కూడా సిద్ధంగా ఉంది. కానీ ఇప్పుడు కొంత కాలం బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నాడు. రీసెంట్ గా శ్రీనువైట్ల.. అఖిల్ తో సినిమా చేయాలని అక్కినేని కాంపౌండ్ ని టచ్ చేసినట్లు తెలుస్తోంది.

మరోపక్క నాగార్జున తన కొడుకుకి హిట్ ఇవ్వాలని పెద్ద పెద్ద దర్శకులను సంప్రదిస్తున్నాడు. ఎంత బడ్జెట్ అయినా తానే నిర్మిస్తానని ఆఫర్ కూడా ఇస్తున్నాడు. అయితే అఖిల్ మాత్రం అంతా సెట్ అయిన తరువాత స్పోర్ట్స్ డ్రామాతో సినిమా చేయాలనుకుంటున్నాడు. మరి ఈసారైనా అఖిల్ కి అనుకున్న హిట్ దక్కుతుందో లేదో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు
Top 10 Movies 2025: పవన్, వెంకటేష్, రాంచరణ్ లలో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఎంత ? 2025లో టాప్ 10 మూవీస్ ఇవే