రూ.13 కోట్లు పెట్టి అపార్ట్మెంట్ కొన్న హీరోయిన్!

Published : Jan 30, 2019, 10:20 AM ISTUpdated : Jan 30, 2019, 10:22 AM IST
రూ.13 కోట్లు పెట్టి అపార్ట్మెంట్ కొన్న హీరోయిన్!

సారాంశం

బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ గతంలో తొమ్మిది కోట్లు పెట్టి ఓ అపార్ట్ మెంట్ ని కొనుగోలు చేసింది. బాలీవుడ్ స్టార్లు కిరణ్ ఖేర్, అనుపమ్ ఖేర్ ల నుండి అలియా ఈ ఆస్థిని కొనుగోలు చేసింది. ఇప్పుడు అంతకుమించిన బడ్జెట్ తో ఖరీదైన ఫ్లాట్ ని సొంతం చేసుకుంది. 

బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ గతంలో తొమ్మిది కోట్లు పెట్టి ఓ అపార్ట్ మెంట్ ని కొనుగోలు చేసింది. బాలీవుడ్ స్టార్లు కిరణ్ ఖేర్, అనుపమ్ ఖేర్ ల నుండి అలియా ఈ ఆస్థిని కొనుగోలు చేసింది.

ఇప్పుడు అంతకుమించిన బడ్జెట్ తో ఖరీదైన ఫ్లాట్ ని సొంతం చేసుకుంది. ముంబైలోని జుహు ఏరియాలో అపార్ట్ మెంట్ ని కొనుగోలు చేసిందట. దాని విలువ దాదాపు రూ.13.11 కోట్లని తెలుస్తోంది. పాతికేళ్లు కూడా నిండని అలియా ఈ రేంజ్ లో ఆస్థులను కొనుగోలు చేయడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

బాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోయిన్లలో ఒకరిగా అలియా పేరు సంపాదించుకుంది. గతేడాది 'రాజీ' చిత్రంతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం 'గల్లీ బాయ్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ ఏడాదిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమాల పరంగానే కాకుండా ఆమె లవ్ లైఫ్ కూడా బాగానే సాగుతుందనిపిస్తోంది. రణబీర్ కపూర్ తో డేటింగ్ లో ఉన్న ఈ బ్యూటీ త్వరలోనే అతడిని పెళ్లి చేసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Ananya Panday: భరతనాట్యం చేశావా? ఖూనీ చేశావా? అనన్య డ్యాన్స్‌పై నెటిజన్ల ఫైర్
Sri Satya: యాంకర్‌గా టర్న్ తీసుకున్న బిగ్‌ బాస్‌ నటి.. కాన్స్ లో శ్రీసత్య కొత్త జర్నీ షురూ