బాక్సాఫీస్ పోరు: నాని వర్సెస్ నాగచైతన్య!

Published : Jan 30, 2019, 10:44 AM IST
బాక్సాఫీస్ పోరు: నాని వర్సెస్ నాగచైతన్య!

సారాంశం

అక్కినేని నాగచైతన్య, నేచురల్ స్టార్ నాని ఒకేరోజు బాక్సాఫీస్ వద్ద బరిలో దిగడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ ఇద్దరు హీరోలు తాము నటించిన సినిమాలను ఒకేరోజు విడుదల చేయాలని అనుకుంటున్నారట. 

అక్కినేని నాగచైతన్య, నేచురల్ స్టార్ నాని ఒకేరోజు బాక్సాఫీస్ వద్ద బరిలో దిగడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ ఇద్దరు హీరోలు తాము నటించిన సినిమాలను ఒకేరోజు విడుదల చేయాలని అనుకుంటున్నారట.

నాగచైతన్య హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న 'మజిలీ' చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే సమయానికి నాని నటిస్తోన్న 'జెర్సీ' సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు చిత్ర దర్శకనిర్మాతలు.

చైతు నటిస్తోన్న 'మజిలీ' సినిమా ప్రేమ, బ్రేకప్, ఆ తరువాత పెళ్లి వంటి అంశాల చుట్టూ తిరగనుంది. ఇక నాని 'జెర్సీ' సినిమా లేటు వయసులో క్రికెట్ బ్యాట్ పట్టి విజయాలు సాధించే ఆటగాడి కథను చూపించబోతున్నారు.

ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా సాగనుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఒకేరోజు బాక్సాఫీస్ వద్ద పోటీ పడడానికి సిద్ధమవుతున్నాయి. మరి బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా సత్తా చాటుతుందో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు
Top 10 Movies 2025: పవన్, వెంకటేష్, రాంచరణ్ లలో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఎంత ? 2025లో టాప్ 10 మూవీస్ ఇవే