'సింహాద్రి' రీరిలీజ్‌ కి ప్రీ రిలీజ్ ఈవెంట్, గెస్ట్ ఆ యంగ్ హీరోనే

Published : May 15, 2023, 04:38 PM IST
'సింహాద్రి' రీరిలీజ్‌ కి ప్రీ రిలీజ్ ఈవెంట్, గెస్ట్ ఆ యంగ్ హీరోనే

సారాంశం

 సింహాద్రి రీరిలీజ్ కి ప్రీరిలీజ్ ఈవెంట్ చేస్తున్నట్లు ఎన్టీఆర్ ఫాన్స్ అనౌన్స్ చేశారు. త్వరలో సింహాద్రి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగబోతుంది, రెడీగా ఉండండి అంటూ ఫాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. 

ఎన్టీఆర్- రాజమౌళి కాంబోలో వచ్చిన సింహాద్రి రీ రిలీజ్ కు సిద్దం చేస్తున్న సంగతి తెలిసిందే.  రీరిలీజ్ ఎన్టీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మే 20న సింహాద్రి సినిమా థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ కానుంది. ఈ సినిమా రీరిలీజ్ ఎవరూ ఊహించని రీతిలో ఉండాలని ఫ్యాన్స్ భావించి,ప్లాన్ చేస్తున్నారు. అక్కడ ఇక్కడా అని లేకుండా అమలాపురం నుంచి అమెరికా వరకూ సింహాద్రి స్పెషల్ షో పడనున్నాయి ఓవర్సీస్ లోనే వంద స్క్రీన్స్ లో సింహాద్రి సినిమా రీరిలీజ్ అవటం విశేషం. ఇప్పటికే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని  సెంటర్స్ లో మే 20న పడబోయే షోస్ హౌజ్ ఫుల్ అయ్యాయి. రీరిలీజ్ కి ఇంకా ఐదు రోజుల సమయం ఉండడంతో ఫాన్స్ స్పెషల్ షోస్ ని యాడ్ చేస్తూనే ఉన్నారు, థియేటర్స్ సంఖ్య పెరుగుతూనే ఉంది. 

ఇదంతా ఒకెత్తు అయితే    సింహాద్రి రీరిలీజ్ కి ప్రీరిలీజ్ ఈవెంట్ చేస్తున్నట్లు ఎన్టీఆర్ ఫాన్స్ అనౌన్స్ చేశారు. త్వరలో సింహాద్రి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగబోతుంది, రెడీగా ఉండండి అంటూ ఫాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. రీ రిలీజ్ ఫంక్షన్ మే 17 న... హైదరాబాద్ జె ఆర్ సి లో జరగనుంది.ఈ ఈవెంట్ కి గెస్టుగా ఎవరు వస్తారు అనేది ఇంటరెస్టింగ్ విషయమే, ఎందుకంటే ఒక రీరిలీజ్ సినిమాకి ప్రీరిలీజ్ ఈవెంట్ చెయ్యడం అంటే మాములు విషయం కాదు. అందుతున్న సమాచారం మేరకు యంగ్ హీరో విష్వక్ సేన్...చీఫ్ గెస్ట్ గా రానున్నారు.   దాంతో  మే 20న రీరిలీజ్ ట్రెండ్ లో నాన్-సింహాద్రి రికార్డ్స్ క్రియేట్ అవ్వడం గ్యారెంటీ అని అందరికీ అర్దమైపోయింది.

సుదర్శన్ థియేటర్ లో సింహాద్రి సినిమాలోని నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడాబుడ్డి సాంగ్ లిరికల్ వీడియోను భారీ హంగామా నడుమ విడుదల చేశారు. ఈ సాంగ్ రిలీజ్ కే ఫ్యాన్స్ చేసిన హంగామా మాములుగా లేదు.థియేటర్ వద్ద ఎన్టీఆర్ కటౌట్ పెట్టి తెగ రచ్చ రచ్చ చేశారు.  ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ చేశారు. బుక్‌మై షోతో పాటు ఇత‌ర టికెట్ బుకింగ్స్ యాప్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతోన్నాయి. తాజాగా ఈ రీ రిలీజ్ మూవీకి ప్ర‌మోష‌న్స్‌ను భారీగా ప్లాన్ చేస్తోన్న‌ట్లు తెలిసింది.   అనేక ప్రాంతాల్లో జూనియర్‌ ఎన్టీఆర్ భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎన్టీఆర్ అభిమానులు రక్తదానం, అన్నదానం, సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక సింహాద్రి మూవీని తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా, దుబై, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లలో కూడా రిలీజ్‌ చేయనున్నారు.

దాదాపు ఏడు కోట్ల బ‌డ్జెట్‌తో 2003లో రిలీజైన ఈ మూవీ 30 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఇందులో సింగ‌మ‌లై, సింహాద్రిగా డ్యూయ‌ల్ షేడ్ క్యారెక్ట‌ర్‌లో ఎన్టీఆర్ క‌నిపించి అరిపిస్తాడు.  భూమిక‌, అంకిత హీరోయిన్లుగా న‌టించారు. ర‌మ్య‌కృష్ణ స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించింది. కీర‌వాణి సంగీతాన్ని అందించాడు. కాగా తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్‌సీస్‌లో సింహాద్రిని రీ రిలీజ్ చేయ‌బోతున్నారు. వ‌ర‌ల్డ్‌లోనే అతి పెద్ద స్క్రీన్ అయిన మెల్‌బోర్న్ ఐమాక్స్ థియేట‌ర్‌లోనూ ఈ సినిమా రిలీజ్ కానుంది.

PREV
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?