`లైగర్‌` డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన.. చిరంజీవి `ఆచార్య`కి ఇచ్చాడు.. మీరెందుకివ్వరు?

Published : May 15, 2023, 03:54 PM IST
`లైగర్‌` డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన.. చిరంజీవి `ఆచార్య`కి ఇచ్చాడు.. మీరెందుకివ్వరు?

సారాంశం

`లైగర్‌` సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చేపట్టారు. `ఆచార్య` సినిమాకి చిరంజీవి భారీగా తిరిగి ఇచ్చారని, తమకి కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

`లైగర్‌` సినిమా నష్టాలు ఇంకా దర్శకనిర్మాత పూరీని వెంటాడుతుంది. ఇది నెమ్మదిగా విజయ్‌ దేవరకొండకి కూడా తగులుతుంది. ఈ సినిమా విడుదలై దాదాపు తొమ్మిది నెలలు పూర్తయ్యింది. తాజాగా పూరీ తన కొత్త సినిమాని ప్రకటించారు. రామ్‌తో `ఇస్మార్ట్ శంకర్‌`కి సీక్వెల్‌ `డబుల్‌ ఇస్మార్ట్`ని అనౌన్స్ చేశారు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో `లైగర్‌` డిస్ట్రిబ్యూటర్లు నిరసన చేపడుతున్నారు. తమని ఆదుకోవాలని, తాము చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటున్నారు. ఎంతో కొంత రిటర్న్ చేసి తమని ఆదుకోవాలని వారు ఆందోళన చేపడుతున్నారు. 

ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి నటించిన `ఆచార్య` చిత్రం గతేడాది విడుదలైంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా భారీగా నష్టపోయింది. కొన్ని డిస్ట్రిబ్యూటర్లు రోడ్డునపడ్డారు. దానికి దర్శకుడు కొరటాల శివ పూర్తి బాధ్యత తీసుకున్నారు. అయితే, చిరంజీవి, రామ్‌చరణ్‌ కూడా తమవంతు సహాయాన్ని అందించారట. వాళ్లు 13కోట్లు వెనక్కి ఇచ్చారని, డిస్ట్రిబ్యూటర్లని ఆదుకున్నారని తెలిపారు. 

నైజాం డిస్ట్రిబ్యూటర్‌కి 13కోట్లు ఇచ్చారని, ఏపీ డిస్ట్రిబ్యూటర్లకి ఎనిమిది కోట్లు వెనక్కి ఇచ్చారట. మొత్తంగా చిరు,చరణ్‌ ఇరవై కోట్ల వరకు పారితోషికం వెనక్కి ఇచ్చారని సమాచారం. నష్టాలు వచ్చిన ప్రతిసారి ఎంతో కొంత వెనక్కి ఇచ్చి ఆదుకుంటున్నారట. అలాగే పూరీ జగన్నాథ్‌ చేయాలని అంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఎంతో కొంత ఆదుకోవాలని, సగంలో సగమైనా ఇవ్వాలి కదా అండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. చిరంజీవి, చరణ్‌ల పేర్లు లాగారంటే ఇప్పుడు విజయ్‌ దేవరకొండని కూడా ఇందులోకి లాగుతున్నారని అర్థమవుతుంది. మరి దీన్ని దర్శక, నిర్మాత పూరీ ఎలా సెటిల్‌ చేస్తారో చూడాలి. 

రామ్‌ మూవీ `డబుల్‌ ఇస్మార్ట్` ప్రకటించిన సందర్బంగా డిస్ట్రిబ్యూటర్లు నిరసన తెలియజేయడంతో అది కొత్త సినిమాపై ప్రభావం పడుతుంది. ఆ ఉద్దేశ్యంతోనే డిస్ట్రిబ్యటర్లు ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. మొత్తంగా `లైగర్‌` సినిమా నష్టాలు ఇంకా వదలడం లేదనిపిస్తుంది.  

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?