‘ఎన్టీఆర్30’ టైటిల్ ఏంటో తెలుసా? ఆ ప్రత్యేకమైన రోజునే విడుదల.. డిటేయిల్స్

By Asianet News  |  First Published May 15, 2023, 3:38 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం NTR30. తర్వలో ఈ చిత్ర టైటిల్ ను అనౌన్స్ చేయబోతున్నారు. తాజాగా టైటిల్ కు సంబంధించిన అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది.
 


‘ఆర్ఆర్ఆర్’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. అదే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. దీంతో తారక్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పై అభిమానుల్లో తారా స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంతో రూపుదిద్దుకుంటున్న NTR30 షూటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూళ్లు కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. 

అయితే, ఇటీవల కాలంలో భారీ చిత్రాల టైటిల్స్ ను మేకర్స్ సస్సెన్స్ లో పెడుతున్న విషయం తెలిసిందే. దీంతో టైటిల్ ఎలా ఉండబోతోందని ఆ ప్రాజెక్ట్స్ పై అంచనాలను, మరింత ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఎన్టీఆర్30 టైటిల్ పై క్రేజీ అప్డేట్ అందింది. మేకర్స్ టైటిల్ ను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కు తగట్టుగా ‘దేవర’ (Devara) అనే శీర్షికను ఎంపికచేశారని అంటున్నారు. ఇదే టైటిల్ ను పవన్ కళ్యాణ్ సినిమాకు పెట్టాలని చూశారంట.  ప్రస్తుతం ఈ టైటిల్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో తారక్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

Latest Videos

మార్చి20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ‘ఎన్టీఆర్30’ టైటిల్ పోస్టర్ ను విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ మాత్రం శరవేగంగా కొనసాగుతోంది. ఇక ఎన్టీఆర్ ఈచిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్. ఓ ఐలాండ్ లో భయం అంటే తెలియని మనుషులకు భయం పుట్టించే పాత్రలో ఎన్టీఆర్ విశ్వరూపం చూపించబోతున్నారని ఇప్పటికే కొరటాల హైప్ పెంచారు. 

ఇక జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఈ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తోందన్నది తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ చిత్రం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా అలరించబోతున్నారు. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 2024 ఏప్రిల్ 05న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో NTR31లో నటించబోతున్నారు. 

click me!